top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 131 : 10. Questions are Usually Discussed under Metaphysics / నిత్య ప్రజ్ఞా సందేశములు


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 131 / DAILY WISDOM - 131 🌹


🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 10. ఆత్మిక ప్రశ్నలు సాధారణంగా ఆదిభౌతిక శాస్త్రంగా చర్చించబడతాయి 🌻


ఆదిభౌతిక శాస్త్రంగా భావించబడిన తత్వశాస్త్రం భగవంతుడు, ప్రపంచం మరియు ఆత్మ యొక్క స్వభావాలు మరియు సంబంధాల గురించి విస్తృతంగా హేతుబద్ధంగా చర్చిస్తుంది. ఆత్మ మరియు ప్రపంచం భగవంతునితో సమానంగానైనా ఉంటాయి, లేదా భిన్నంగా నయినా ఉంటాయి. అవి భగవంతుని భాగంగా అయినా ఉంటాయి లేదా భగవంతుని రూపంగానైనా ఉంటాయి. అత్యున్నత వాస్తవికత దేవుడు అవ్వొచ్చు, లేదా భౌతిక ప్రపంచం మాత్రమే కావొచ్చు, లేదా వ్యక్తిగత మనస్సు మాత్రమే అవ్వొచ్చు. దేవుడు ఉంటాడు లేదా ఉండడు. అనుభవానికి మూలం భగవంతుడు అవ్వొచ్చు లేదా కాకపోనూ వచ్చు. ప్రపంచం భౌతికమైనది అవ్వొచ్చు లేదా మానసికమైనది అవ్వొచ్చు. చైతన్యం అనేది పదార్థం నుండి స్వతంత్రంగా ఉండొచ్చు లేదా దానిపై ఆధారపడి ఉండొచ్చు.


ప్రపంచం మొత్తం ఏకం, అనేకం, వాస్తవం, అవాస్తవం, ఊహ, అనుభావికం వీటిలో ఏదైనా కావొచ్చు. మానవుడు స్వేచ్చా జీవి కావొచ్చు లేదా కాకపోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ఆడిభౌతిక శాస్త్రం క్రింద చర్చించబడతాయి. ఇది విశ్వానికి, సృష్టికి మధ్య తేడా కూడా చెప్తుంది. అదే కాకుండా దేశం, కాలం, సృష్టి, స్థితి, లయ, పరిణామ క్రమం, పుట్టుక, చావు, మరణం తర్వాత జీవితం గురించి శాస్త్ర వివరణలు మొదలైన ఎన్నో ప్రశ్నలను ఈ ఆదిభౌతిక శాస్త్రం చర్చిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రం యొక్క తాత్విక ప్రాతిపదికను ఆదిభౌతిక శాస్త్రం కింద కూడా చేర్చవచ్చు. విజ్ఞాన శాస్త్రం కింద వివిధ సిద్ధాంతాలు మరియు ప్రక్రియలు, అలాగే తప్పుడు జ్ఞానం యొక్క స్వభావం గురించి వివరంగా చర్చించబడ్డాయి.




కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 131 🌹


🍀 📖 The Philosophy of Life 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 10. Questions are Usually Discussed under Metaphysics 🌻


Philosophy conceived as metaphysics deals with an extensive reasoned discussion of the natures and the relations of God, world and the individual soul. The latter two are either identical in essence with God, or are attributes or parts of God, or are different from God. The ultimate Reality is either God, or the world of perception alone, or only the individual mind. God either exists or not, and is necessary or unnecessary for an explanation of experience. The world is either material or mental in nature; and consciousness is independent of or is dependent on matter.


The world is either pluralistic or a single whole, and is real, ideal or unreal, empirical, pragmatic or rational. The individual is either free or bound. Questions of this nature are usually discussed under metaphysics. It also delineates the process of cosmogony and cosmology, the concepts of space, time and causation, creation, evolution and involution, as well as the presuppositions of eschatology or the discourse on the nature of life after death. The philosophical basis of modern physics and biology also can be comprised under metaphysics. Under epistemology the various theories and processes of the acquisition of right knowledge, as well as the nature and possibility of wrong knowledge, are discussed in detail.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comentários


bottom of page