🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 134 / DAILY WISDOM - 134 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 13. అర్థమయ్యేలా బోధించడం తత్వశాస్త్రం యొక్క విధి 🌻
తత్వశాస్త్రం అనేది పూర్తి ప్రపంచ దృక్పథం. జీవితం పట్ల బుద్ధి, సంకల్పం మరియు అనుభూతి యొక్క ఒక వైఖరి. ఇది మనకు తెలిసిన వాస్తవికతను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా పూర్తి విశ్వాన్ని దాని అన్ని కోణాల్లో తెలుసుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది భౌతిక పరిశీలన యొక్క వివరాలు లేదా వివరాల ముక్కల యొక్క వివరణ కాదు. జీవితానికి సంబంధించిన ఇతర దృక్కోణాలతో సామరస్య పూర్వకంగా సంబంధం కలిగి ఉండటానికి మరియు మనిషి యొక్క అన్ని సామర్థ్యాల అవసరాలను అత్యధిక స్థాయిలో సంతృప్తి పరిచేంత విస్తృతమైనప్పుడు మనము వివరణను తాత్వికమని పిలుస్తాము. అందులో కేవలం అనుభావిక వాస్తవాలను కాకుండా, అత్యున్నత సూత్రాలు ఉంటాయి.
“తత్వశాస్త్రం అనే పదానికి అర్థం సాధనలో ఉన్న ఆత్మ” అని విలియం జేమ్స్ చెప్పారు. మనిషిలో ఆధ్యాత్మిక ఉద్దీపన మాత్రమే తత్వశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని పిడివాద పద్ధతిలో మరియు బలవంతంగా బోధించడం ఒక పద్ధతి, మరియు దానిని హేతుబద్ధంగా మరియు ఆకర్షణీయంగా దానిని అత్యున్నత సంపూర్ణతతో బోధించడం మరొక పద్ధతి. రెండోది తత్వశాస్త్రం యొక్క మార్గం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 134 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 13. Teaching in an Appealing Way is the Task of Philosophy 🌻
Philosophy is a complete world-view, a Weltanschauung, a general attitude of intellect, will and feeling, to life. It gives an explanation of the universe at large, by appealing to what is discoverable as the deepest of known facts. It is not a mere description of the details or bits of physical observation. We call an explanation philosophical when it is broad enough to be harmoniously related to the other views of life and fulfils the needs of all the faculties of man to the highest degree of satisfaction, using ultimate principles, and not mere empirical facts, in establishing its validity.
“Philosophy, indeed, in one sense of the term, is only a compendious name for the spirit in education,” says William James. It is only in this sense of the process of the education and unfoldment of the spiritual spark in man that philosophy is worth its name. To teach a doctrine in a dogmatic and forced way is one thing, and to do it in a rational and appealing way in its greatest fullness is another. The latter is the task and the way of philosophy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント