top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 137 : 16. The Question of an Ultimate Cause / నిత్య ప్రజ్ఞా సందేశములు - 137 : 16. అత్


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 137 / DAILY WISDOM - 137 🌹


🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 16. అత్యున్నత కారణం గురించిన ప్రశ్న 🌻


కార్యకారణ సంబంధం లేవనేత్తే ప్రశ్నలకు తత్వశాస్త్రం సమాధానం చెప్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని విశ్వసిస్తుంది. ఇది కాలం అనేది ఒక గీతలా ముందుకు వెళ్తుందని, కారణం తర్వాత కార్యం సంభవిస్తుందని నమ్ముతుంది. దాని వల్ల మనం కార్యం నుండి కారణం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే మనకు అర్థం కాకుండా గందరగోళానికి గురవుతాము. అత్యున్నత కారణం లేదా విశ్వ కారణం అనే ప్రశ్నకు విజ్ఞాన శాస్త్రం సమాధానం చెప్పదు. విశ్వ కారణం ఎలా వ్యక్తమవుతుంది అనేది ఎప్పటికీ తెలీదు.


విశ్వంలోని సంఘటనల క్రమం మరియు పద్ధతిని, మనం అలవాటు పడిన కార్యకారణ సిద్ధాంతం ద్వారా కాకుండా, ఒక ఉన్నత శక్తి ద్వారా నడిపించబడుతున్న ప్రాణ సిద్ధాంతం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం విజ్ఞాన శాస్త్రం చేస్తే, దాన్ని అర్థం చేసుకోలేక పోగా, చిక్కుల్లో పడుతుంది. విశ్వంలోని వివిధ భాగాల మధ్య ఒకే సమయంలో పరస్పర చర్యలు ఉన్నందువల్ల కార్యకారణ సిద్ధాంతం వాటిని విశదీకరించడంలో విఫలమవుతోంది. దీనిని అర్థం చేసుకోవడానికి మనకు ఇంకా లోతైన తత్వశాస్త్రం కావాలి. ఇది విషయాల యొక్క సత్యాన్ని మనముందు ఆవిష్కరిస్తుంది. విజ్ఞాన శాస్త్రం గమనించిన వాస్తవాల స్వభావానికి సంబంధించిన విచారణ మనల్ని జ్ఞానశాస్త్రం మరియు ఆదిభౌతిక శాస్త్రం వైపు నడిపిస్తుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 137 🌹


🍀 📖 The Philosophy of Life 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 16. The Question of an Ultimate Cause 🌻


The problem of causality has raised questions that stress the need for philosophy. Science believes that every event has a cause and resorts to a kind of linear argument, thinking that to be a cause means just to be antecedent in time. Our movement from effects to causes leads us nowhere, and we find ourselves landed in a hopeless pursuit. The question of an ultimate cause cannot be answered by science. The end or purpose of action is, to it, enveloped in darkness.


If the order and method of events in the universe is determined, not by the way in which we are accustomed to observe cause-and-effect relation, but by the laws of a living organism directed by a unitary force, science cannot but find itself in a fool’s paradise. When there is mutual interaction among the constituents of the universe, the common sense view of causality falls to the ground. We require a reflective higher study, which is provided by philosophy, in order to come to a satisfactory conclusion regarding the true scheme of things. An enquiry into the nature of facts observed by science leads us to epistemology and metaphysics.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page