top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 147 : 26. The Consciousness of the Loving Brotherhood / నిత్య ప్రజ్ఞా సందేశములు - 147


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 147 / DAILY WISDOM - 147 🌹


🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 26. ఆత్మ యొక్క ప్రేమ పూర్వక సోదరభావం🌻


వేదాంతము ప్రపంచాన్ని అసహ్యించు కోవాలని లేదా ఇది కాకుండా వేరే ప్రపంచంలో ఒంటరిగా ఉండాలని బోధించదు. ఎవరైనా జీవితంలో తన విధులను విడనాడాలని లేదా ఆనందరహితంగా ముఖం పెట్టుకోవాలని లేదా ఏదైనా ప్రస్ఫుటంగా ప్రవర్తించాలని చెప్పదు. స్వార్థపూరితంగా ఉండకూడదని లేదా ఏ క్షణికమైన వస్తువుతో బంధం కలిగి ఉండకూడదని, విశ్వంలో ఆత్మ యొక్క ప్రేమపూర్వక సోదరభావం మరియు ఏకత్వం యొక్క చైతన్యంలో జీవించాలని, సత్యం అవిభాజ్యమైనదని, ద్వేషం, శత్రుత్వం, కలహాలు మరియు స్వార్థం ఆత్మస్వభావానికి విరుద్ధం అని, జనన మరణ బాధలు స్వయం యొక్క అజ్ఞానం వల్ల కలిగుతాయని చెప్తుంది.


అనుభూతి యొక్క అత్యున్నత స్థాయి బ్రహ్మాన్ని తెలుసుకోవడం అని, తద్వారా అమరమైన జీవితం గడపడమని, ప్రతి ఒక్కరూ ఈ పరమ ప్రయోజనం కోసమే పుట్టారని, ఇది మనిషి యొక్క అత్యున్నత కర్తవ్యమని, ఇతర విధులన్నీ ఈ పరమ కర్తవ్యానికి సహాయకాలు మాత్రమే అని, బంధాలలో ఇరుక్కోకుండా అంకిత భావంతో తన నిర్దేశిత కర్తవ్యాలను నిర్వహించమని, తమ చర్యలను పరమాత్మ పట్ల చేయమని, జీవితంలోని ప్రతి అంశమూ ఈ పరమాత్మ చైతన్యం తో సంపూర్ణంగా నిండి ఉండాలి అని చెప్తుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 147 🌹


🍀 📖 The Philosophy of Life 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 26. The Consciousness of the Loving Brotherhood 🌻


The Vedanta does not teach that one should detest the world or isolate oneself in some world other than this. It does not proclaim that anyone should forsake his duties in life or put on a grave face or behave in any conspicuous manner. His Vedanta declares that one should not be selfish or attached to any fleeting object, that one should live in the consciousness of the loving brotherhood and unity of the Self in the universe, that the truth of existence is one and indivisible, that division or separation, hatred, enmity, quarrel and selfishness are against the nature of the Self, that the pain of birth and death is caused by desire generated by the ignorance of the Self.


The highest state of experience is immortal life or the realisation of Brahman, that everyone is born for this supreme purpose, that this is the highest duty of man, that all other duties are only aids or auxiliaries to this paramount duty, that one should perform one’s prescribed duties with the spirit of non-attachment and dedication of oneself and one’s actions to the Supreme Being, and that every aspect of one’s life should get consummated in this Consciousness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





コメント


bottom of page