top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 152 : 31. The Absolute is Beyond Thought / నిత్య ప్రజ్ఞా సందేశములు - 152 : 31. సంపూర్


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 152 / DAILY WISDOM - 152 🌹


🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 31. సంపూర్ణమైనది ఆలోచనకు మించినది 🌻


కనిపించేవాటిలో వాస్తవికత ఉంటుంది, కానీ వాస్తవికత కనిపించకుండా భిన్నంగా ఉంటుంది. సంపూర్ణత యొక్క విశేషణాలుగా కూడా స్వరూపాలు ఉండవు. ఎందుకంటే తనకు తాను తప్ప సంపూర్ణతను ఇంకేదీ వర్ణించలేదు. ఇంద్రియ ప్రపంచంలోనే లక్షణాలకు అర్థం ఉంటుంది. సంబంధాలు లేకుండా లక్షణాలు లేవు, మరియు అన్ని సంబంధాలు అనుభావికమైనవి మాత్రమే. లక్షణాలు ఉన్న సంపూర్ణత మనుగడలో ఉండలేదు. ఎందుకంటే అది ఇంకొకదాని కంటే వేరుగా ఉండాలి. ఈ భేదం ఒక నిర్దుష్టమైన వ్యక్తిత్వానికి దారి తీస్తుంది.


వ్యక్తిత్వం సంపూర్ణత ఈ రెండూ విషయాలు ఒకదానితో ఒకటి జత చేయలేనివి. మీరు ఎంత ప్రయత్నించినా సంపూర్ణ వ్యక్తిత్వం, లేదా వ్యక్తిత్వ సంపూర్ణత సాధ్య పడేవి కావు. ఈ రెండు పదాలు ఒక దానినే సూచిస్తే, అప్పుడు అవి రెండూ ఒకటే కాబట్టి ఒకటే అయి ఉన్న వాటి మధ్య ఒక సంబంధాన్ని మనం ఊహించలేము. కానీ రెండు పదాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటే, అవి వారి మధ్య ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. సంపూర్ణతకు లక్షణాలు లేదా సంబంధాలు లేవు, ఎందుకంటే ఇది ఆలోచనకు మించినది. దాని ఉనికికి తానే సాక్ష్యం.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 152 🌹


🍀 📖 The Philosophy of Life 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 31. The Absolute is Beyond Thought 🌻


Appearances have reality in them, but reality is different from appearances. Appearances do not exist in the Absolute even as its adjectives, for it can have no adjectives other than itself. Qualities have a meaning only in the sense world. There is no quality without relations, and all relations are empirical. A relational Absolute must be perishable, for, here, its very essence is said to include distinction, and all distinction presupposes individuality.


The two terms of a relation are really separated by an unbridgeable gulf, and no stretch of imagination can intelligibly bring out their connection. If the two terms are identical, there is no relation, for there will then be no two things to be related. But if the two terms are different from each other, they can bear no relation. The Absolute has no qualities or relations, for it is beyond thought. The proof of its existence is itself.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page