🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 153 / DAILY WISDOM - 153 🌹
🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 1. చిన్న విషయాలలో మనం ఏది అయి ఉంటామో, పెద్ద విషయాలలో కూడా అదే అయి ఉంటాము. 🌻
మనం ఏ పాత ఆలోచనలతో జన్మించామో, సరైనవిగా భావించామో, అవే పాత ఆలోచనలతో చనిపోవడం సరికాదు. వాస్తవానికి, మనవి సరియైన ఆలోచనలు కావు, వాటిని మార్చుకునే అవసరం ఎంతైనా ఉంది. చిన్న విషయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో, పెద్ద విషయాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. చిన్న విషయాలలో మనం ఎలా ఉంటామో, మనం పెద్ద విషయాలలో కూడా అలానే ఉన్నాము. మనం చిన్న విషయాలలో నిర్లక్ష్యంగా ఉన్నాకానీ పెద్ద విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటామని అనుకోకూడదు.
చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే పెద్ద విషయాల్లో కూడా నిర్లక్ష్యంగానే ఉంటాం. మీకు తెలిసినట్లుగా, ఒక్కొక్క చుక్క సముద్రాన్ని ఏర్పరుస్తాయి. చిన్న విషయంగా పరిగణించబడే ఒక కప్పు టీ తాగడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మనం ఒక సోదరుడితో మాట్లాడే కొన్ని మాటలు వంటి చిన్న విషయం యోగసాధన లేదా భగవంతుని సాక్షాత్కారం వంటి పెద్ద విషయం అంత ముఖ్యమైనది. నేను పరిహాసం చేయడం లేదు. ఇవి మనం ఆలోచించవలసిన మరియు ధ్యానించవలసిన ముఖ్యమైన విషయాలు. అప్రధానమైనది ఏదీ లేదు. కనీసం భగవంతుని ముందు, ఏదీ అప్రధానమైనది, అనవసరమైనది లేదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 153 🌹
🍀 📖 In the Light of Wisdom 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 1. What We are in Small Things, That We are Also in Big Things 🌻
It is not proper that we should simply die with the same old ideas with which we were born and which we always thought were the right things. It is possible that we are, in fact, not correct in our assumptions and that they may need correction. Just as this is the circumstance in small matters, this happens to be the situation in big things as well. What we are in small things, that we are also in big things. We should not think that we can just be careless in small matters but then be very careful in big matters.
When we are careless in tiny things, then we will also be careless in big things. Drops make the ocean, as you know. Even the apparently small matter of drinking a cup of tea is important. A small thing like a few words that we speak to a brother is as important as a big matter like the practice of yoga or even God-realisation itself. I am not just joking. These are serious things upon which we should reflect and meditate. There is nothing that is unimportant. Before God at least, nothing is unimportant, insignificant or unnecessary.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare