🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 36 / DAILY WISDOM - 36 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 5. మనం మానసిక ప్రపంచ జాతీయులం 🌻
మనం సామాజిక జీవుల యొక్క భౌతిక ప్రపంచానికి చెందిన దాని కంటే కూడా ఎక్కువగా మానసిక ప్రపంచానికి చెందిన జాతీయులం. మన మానసిక ఉపకరణం ఒక సంక్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ప్రపంచంలోని దాదాపు ప్రతి దానితో సంబంధాలను కలిగి ఉంది. ఇది ఒక ప్రధాన నియంత్రణా పరికరం లాంటిది. మనం కనిపించే విషయాల పట్ల అంతగా నిర్లిప్తంగా లేము. మన అంతర్గత విషయాలకు మరియు వెలుపల ఉన్న మొత్తం విశ్వానికి మధ్య కనిపించని లోతైన సంబంధం ఉంది.
మనం యోగ సాధన రంగంలోకి ప్రవేశించినప్పుడే, మనం మన విశ్వ సంబంధాలపై కూడా పనిచేయడం ప్రారంభిస్తాము. ఇది గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మనం ఇతరులతో ఎలాంటి సంబంధం లేని ఒంటరి వ్యక్తులమని నమ్ముతున్నాము. కానీ ధ్యానం అనే ఒక సాహసం మన ముందుకు కొత్త దృశ్యాన్ని తెస్తుంది. మనం మేల్కొని ఉన్నప్పుడు జీవితంలో స్పష్టంగా కనిపించని సంబంధాలను మన మందు ఆవిష్కరింప చేసి మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 36 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 5. We are Nationals of a Psychic World 🌻
We are nationals of a psychic world, more properly than the way in which we belong to the physical world of social beings. Our psychic apparatus is a complicated structure, because it has connections with almost everything in the world. It is like a main switchboard. We are not so much detached from things as we appear to be. There is a subterranean relationship between our inner contents and the whole cosmos outside.
The moment we begin to enter the realm of yoga practice, we also start operating upon our cosmic relationships. This is something important to remember. At present we believe that we are isolated individuals with no connection whatsoever with others. But meditation is adventure, which opens up a new vista before us and surprises us with our relationships which were not apparent in our waking work-a-day life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments