🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 38 / DAILY WISDOM - 38 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 7. జీవితం ఒక కొనసాగింపు 🌻
జీవితం ఒక కొనసాగింపుతో ఉంటుంది. దానిలో మనం ఒక భాగం. మనం ఇక్కడ కూర్చున్న ఒక పేరు మాత్రమే కాదు. నిజానిజాలు తెరిచి చూస్తే ఇప్పటిదాకా మూర్ఖపు జీవితం గడుపుతున్న మనం ఇప్పుడు గంభీరంగా ఉండాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. మనకి సమయం తక్కువగా ఉంది. నేర్చుకోవలసినది చాలా ఉంది. సాధించడానికి చాలా ఉంది. అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు కాలయాపన చేయడానికి సమయం లేదు.
మనం విషయాలను తేలికగా తీసుకోలేము. జీవితం విలువైనది. మనం దానిని హాస్యాస్పదంగా తీసుకోలేము. సమయం యొక్క ప్రతి క్షణం బంగారం లాంటిది. ఎందుకంటే ప్రతి సాగుతున్న ప్రతిక్షణం మన జీవితవ్యవధిలో నష్టం తప్ప మరొకటి కాదు. మోగిన ప్రతి గంట మనం ఒక గంట కోల్పోయామని చెబుతుంది. ఇది సంతోషకరమైన విషయం కాదు. మనం కోరుకునే దానిలో అంతర్దృష్టిని పొందేందుకు మన ప్రయత్నం దృఢంగా ఉండాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 38 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 7. Life is a Continuity 🌻
There is a continuity, which is life, of which we are a part, and we are not just X, Y, Z or A, B, C sitting here; it is not like that. If we open our eyes to fact, we will be surprised that we have been living a foolhardy life up to this time, and now the time has come when we have to be serious. Our time is short, and there is so much to learn, and a lot to achieve. Obstacles are too many, and we have no time to wool-gather, sleep or while away our time as if there is eternity before us.
We cannot take things lightly. Life is precious. We cannot take it as a joke. Every moment of time is as gold because every moment is nothing but a little loss of this span of our life. Every bell that rings tells us that we have lost one hour. It is not a happy thing. Tenacious has to be our effort at gaining insight into that which we seek.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios