🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 41 / DAILY WISDOM - 41 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 10. యోగ అంటే ఆనందం 🌻
యోగ అంటే ఆనందం. ఇది బాధ కాదు. ఇది ఆనందంలోకి ప్రయాణం. ఒక ఆనంద స్థితి నుండి, మనం మరొక ఆనంద స్థితికి ప్రయాణం. యోగము అనేది దుఃఖంతో మొదలవుతుందని కాదు. మనల్ని నిర్బంధించే ఒక రకమైన జైలు గృహమని కాదు. యోగం అనేది మనిషి యొక్క సాధారణ జీవితానికి ఒక హింస, బాధ అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. సాధన అంటే భయం, మరియు ఒక అసహజమైన తీవ్రతను సూచిస్తుంది. ఇది తరచుగా జరుగుతుంది.
ఎందుకంటే ప్రజలు యోగ గురించి తమలో తాము ఒక తీవ్రత మరియు దృఢత్వం యొక్క చిత్రాన్ని రూపొందించుకున్నారు. ప్రాపంచికత మరియు మానవుని సహజ అభిరుచుల నుండి యోగ సాధనని విడిగా చూసారు. మన కోరికలు, నిస్సందేహంగా, యోగానికి అడ్డంకులే. కానీ అవి ‘మన’ కోరికలు; ఇది మనం గుర్తుంచుకోవాలి. అవి ఎవరివో కావు. కాబట్టి, ఈ కోరికల నుండి మనల్ని మనం క్రమంగా వేరు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మన చర్మాన్ని మనమే ఒలుచుకున్నట్లు అనిపించకూడదు. అటువంటి కఠినమైన చర్య తీసుకోకూడదు. అది యోగా యొక్క ఉద్దేశ్యం కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 41 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 10. Yoga is a Process of Rejoicing 🌻
Yoga is a process of rejoicing. It is not a suffering. It is a movement through happiness. From one state of joy, we move to another state of joy. It is not that yoga starts with sorrow, or that it is a kind of prison house into which we are thrown. We have sometimes a feeling that yoga is a torture, a suffering, to the normal life of man. Sadhana means a fear, and indicates an unnatural seriousness.
This is so, often because people have created a picture of awe and sternness about yoga, an other-worldliness about it, dissociated from the natural likings of the human being. Our desires are, no doubt, obstacles to yoga. But they are ‘our’ desires; this much we must remember, and they are not somebody’s. So, we have to wean ourselves from these desires gradually and not make it appear that we are peeling our own skin. Such a drastic step should not be taken, and it is not the intention of yoga.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments