🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 43 / DAILY WISDOM - 43 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 12. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే వెళతారు. 🌻
చాలా సార్లు, మనం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఏదో ఒక నిరాశతోనే వెళ్తామని అనిపిస్తుంది. మానవుల మానసిక చరిత్ర అంటూ ఒకటి ఉంటే, అది మనం చదివితే, ఎక్కడో అత్యంత పుణ్యాత్ములు తప్ప ఈ ప్రపంచాన్ని సంతృప్తి తో విడిచి వెళ్లిన వారు నూటికోకోటికో ఒక్కరు ఉంటారు. ఏదో ఒక అసంతృప్తి, పూర్తి చేయాల్సిన పని, అందరికీ మిగిలిపోతుంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే వెళతారు. ఇది ఎప్పటికీ పూర్తికాదు. ఇది భౌతిక జీవితం యొక్క బాధాకరమైన పార్శ్వం. భౌతిక జీవితం అంటే మనకు చిత్రీకరించబడిన చిత్రం ఇదే. కానీ మన లోపల మనకు ఓదార్పు ను సంతృప్తిని కలిగించే ఒక మూలం ఉంది. దీని ఆభాస మనకు అంత తరచుగా రాదు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఉంది, అది మన దృష్టిగోచరం కాకుండా ఉంటోంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 43 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 12. Everyone Goes with Something Left Incomplete 🌻
It looks, many a time, that we have to pass away from this world in despair with everything. If we read the history of the minds of human beings, if there is any such thing as a history of psychology of human nature as such, we will be surprised to observe that it is impossible to pinpoint even one individual who has left this world with genuine satisfaction, save those few who are the salt of the Earth. There has always been a gap, an unfinished something with which the person had to quit.
Everyone goes with something left incomplete. It will never be finished. This is the seamy side of things, the unhappy facet of life, which seems to be the outer picture of this world painted before us. But we have also a peculiar solacing and satisfying inner core, which always eludes our grasp. There is something in us, in each one of us, which escapes our notice. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comments