🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 55 / DAILY WISDOM - 55 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 24. శాస్త్రం తత్వం అవుతుంది 🌻
'నేను జీవిస్తున్నాను, ఎందుకంటే నాకు జీవించడానికి ఒక కారణం ఉంది. కేవలం లక్ష్యం లేని చలనం కాదు' అని ఎవరైనా చెప్పినప్పుడు, కారణం అంటే ఏమిటో వివరించాలి. ఇలా చెప్పడం ద్వారా పెద్ద కష్టాల్లోకి మనం అడుగులు వేస్తామన్నది ఆసక్తికరం. జీవించడానికి కారణం అంటే ఏమిటి? దీని అర్థం తన ముందు ఒక లక్ష్యం ఉంది అనే విషయం యొక్క స్పృహ. ఇప్పుడు, మళ్ళీ, మనం ప్రమాదపు అంచుల్లో నడుస్తున్నామని అర్థం చేసుకోవాలి. శాస్త్రం నుండి, మనం ఎక్కడికి వచ్చాము? మన ముందు ఒక లక్ష్యం ఉందని స్పృహలో ఉండటమంటే జీవించే కారణం ఉన్నట్లే.
జీవితం, చైతన్య స్థితి నుండి విడదీయరానిది. చివరికి, జీవశాస్త్రం కూడా మనల్ని భౌతికశాస్త్రం ఏ విషయానికి చేర్చిందో అదే విషయానికి తీసుకువెళుతుంది. చైతన్యం అనే సూత్రం లేకుండా, మనం ఏమి చేసినా, ఏ దిశలో కదిలినా అది అసాధ్యమే అనే విషయం నుండి మనం తప్పించుకోలేము. ప్రాథమిక శాస్త్రాలైన ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం- చివరగా చెప్పడానికి ఒక విషయం ఉంది. అది ఏమిటంటే అవి చెప్పదలచుకున్న విషయం చివరికి వాటి శాస్త్ర పరిమితిని దాటిపోతుంది అని. చివరికి శాస్త్రం తత్వం అవుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 55 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 24. Science becomes Philosophy 🌻
When I say, “I am living, because I have a purposive existence, and not merely an aimless motion,” I have to explain what I mean by purposiveness. It is interesting to see how we go from step to step into greater difficulties. What do we mean by a purposive existence? It would mean, at least in outline, the consciousness of an aim in front of oneself. Now, again, we see where we are moving, dangerously. From science, where have we come? To be conscious that there is an aim before us is to be purposive.
Life is, again, inseparable from a state of consciousness. And in the end, biology, also, takes us to the same thing on which physics landed us. Somehow we cannot escape the dilemma of it being impossible for us to be without the principle of consciousness, in whatever we do, in whatever direction we move. The basic sciences—astronomy, physics, chemistry and biology—have a common thing to say, finally. In the end they tell us the same thing and by this proclamation of a truth, which is beyond their own jurisdiction, they, as sciences, are exceeding their limits. Science becomes philosophy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments