top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 60 - 29. Fear is Caused by Duality / నిత్య ప్రజ్ఞా సందేశములు - 60 - 29. ద్వంద్వత్వం వ


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 60 / DAILY WISDOM - 60 🌹


🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 29. ద్వంద్వత్వం వల్ల భయం కలుగుతుంది 🌻


భౌతికంగా, రసాయనికంగా మరియు జీవశాస్త్రపరంగా మిమ్మల్ని తెలుసుకోవడం అంటే మిమ్మల్ని నిజంగా తెలుసుకోవడం కాదు. ఎందుకంటే భౌతికంగా, రసాయనికంగా మరియు జీవశాస్త్రపరంగా, ప్రతి వ్యక్తి ఒకలాగానే ఉంటారు. ప్రతి వ్యక్తిలో ఒకే పదార్ధం ఉంటుంది, ప్రతి వస్తువు-భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే పంచభూతాల సమాహారంతోనే ఏర్పడ్డాయి. కాబట్టి, ఒక శరీరాన్ని అధ్యయనం చేస్తే అన్నీ శరీరాల గురించి తెలుసుకున్నట్లే.


శరీర నిర్మాణంలో ప్రతిదీ సమానంగా ఉంటే, అనేక వ్యక్తులు మరియు అనేక వస్తువులు ఎందుకు ఉన్నాయి? శాస్త్రీయ పరిశీలన మన భౌతిక మరియు సామాజిక జీవితానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది, కానీ అది నిజమైన జ్ఞానం కాదు; దాని ద్వారా ఏదీ తెలుసుకోలేము. నిజంగా మీకు బాహ్యంగానే ఉన్నట్లైతే ఒక్క పరమాణువును కూడా మీరు తెలుసుకోలేరు. బయట ఉన్న ఈ ప్రపంచం ఒక అద్భుత ప్రపంచం. దీనికి విపరీతమైన, భయంకరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మీకు బాహ్యంగా ఉన్నదేదైనా మీకు భయం, ఆందోళన మరియు అభద్రత కలిగిస్తాయి. ద్వంద్వత్వం వల్లే భయం కలుగుతుందని ఉపనిషత్తులో ఒక గొప్ప సూక్తి ఉంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 60 🌹


🍀 📖 Philosophy of Yoga 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻29. Fear is Caused by Duality 🌻


To know you physically, chemically and biologically is not to know you, because physically, chemically, and biologically, one would be the same as the other. The same substance is in each person, each thing—the earth, water, fire, air and ether are the components of the physical body of each and every individual in the world, so that to study one body would be equal to studying any other body.


Why are there many people and many things, if everything is equal in bodily structure? The scientific observation is tentatively useful for our physical and social life, but it is not real knowledge; by it nothing can be known, not even one atom, truly if it is ‘outside’. This world outside is a fantastic world. It has a tremendous, fearsome significance, for anything that is outside is a source of fear, anxiety and insecurity. There is a great saying in the Upanishad that fear is caused by duality.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

תגובות


bottom of page