🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 62 / DAILY WISDOM - 62 🌹
🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 2. వస్తువులను ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. 🌻
నశ్వరమైన ఈ జగత్తులో వస్తువులు ఎలా ఉన్నాయంటే వాటిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. ఈ యజమాని అనే భావన మనస్సులో ఒక విచిత్రమైన భావన. ఈ భావన ఎంత అబద్ధమో మనకు బాగా తెలుసు. మీరు ఆలోచనలో తప్ప మీరు దేనికీ యజమానులు కారు. కాబట్టి, మనం ఆస్తి యొక్క యాజమాన్యం అని దేనినైతే పిలుస్తామో, ఇది కేవలం మనస్సు యొక్క స్థితి. నేను మీకు చాలా చిన్న స్థూల ఉదాహరణ ఇవ్వగలను: అక్కడ ఒక పెద్ద విస్తీర్ణంలో ఒక భూమి ఉందనుకుందాం. దానిలోనే వ్యవసాయ ఆధారితమైన విస్తారమైన పొలం ఉంది అనుకుందాం.
ఈ రోజు అది ఒకరి యాజమాన్యంలో ఉంది, మరియు రేపు అది ఆస్తి బదిలీ ద్వారా వేరొకరి యాజమాన్యంలో ఉంటుంది. ఇప్పుడు, ఈ ఆస్తి బదిలీ అంటే ఏమిటి? నిజానికి, ఇది ఎప్పుడూ ఎక్కడికీ బదిలీ చేయబడలేదు. ఇది దాని స్వంత స్థలంలోనే ఉంది. ఇది ప్రజల ఆలోచనలలో ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేయబడింది అంతే. కాబట్టి, మీకు నచ్చినా, నచ్చకపోయినా మనం యాజమాన్యం అని, నాది అని పిలుచుకునే విషయం అప్పటి సమూహం అందరూ కలిసి ఒప్పుకున్న ఒక మానసిక ఒప్పందం తప్ప మరొకటి కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 62 🌹
🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻2. Things Cannot be Possessed by Anyone 🌻
The arrangement of things is such, in the temporal realm, that things cannot be possessed by anyone. The idea of possession is a peculiar notion in the mind. You know very well how false the idea of possession is. You cannot possess anything except in thought. So, what we call ownership of property, is a condition of the mind. I can give you a very small gross example: There is a large expanse of land, a vast field which is agricultural in itself.
Today you say, it is owned by ‘A’, and tomorrow it is owned by ‘B’, by transfer of property. Now, what do you mean by this transfer of property? It has never been transferred. It is there in its own place. It has been transferred in the ideas of people. The whole question of ownership, or psychologically put—like or dislike, is a condition of the mind which is an arrangement of psychological values, agreed upon by a group of people who have decided that this should be the state of affairs.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Bình luận