🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 68 / DAILY WISDOM - 68 🌹
🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 8. ప్రతి కార్యకలాపం ఒక మానసిక విధి 🌻
పురుష సూక్తం యొక్క విశ్వయాగం ఒక ఆచారాన్ని ఆధ్యాత్మిక ధ్యానంగా మార్చగల మార్గం. లేదా ఆధ్యాత్మిక ధ్యానాన్ని ఒక అద్భుతమైన కర్మగా అర్థం చేసుకోవచ్చు. వేదాలలోని బ్రాహ్మణాలలో చాలా ఆచారాలు. చెప్పబడ్డాయి. కానీ అవే ఆచారాలు ఆరణ్యకాలలో, ఉపనిషత్తుల్లో ప్రతి ఆచారం ఒక ఆలోచన యొక్క వ్యక్త రూపమని, కేవలం భౌతిక శరీరం యొక్క కదలిక కాదని, తద్వారా ప్రతి కర్మ ఒక యజ్ఞమే అనే ఒక అత్యున్నత జ్ఞానంగా పరివర్తన చెందాయి.
ప్రతి చర్య ఒక మానసిక ప్రక్రియ. కేవలం భౌతిక ప్రక్రియ కాదు. మనం చర్యను ధ్యానంగా మార్చినప్పుడు మనం అర్థం చేసుకోవలసినది ఇదే. చైతన్యం నుంచి వేరుగా లేని అత్యున్నత ఉనికి ఒక ఆలోచన చేసింది. పురుష సూక్తం భగవంతుడు బ్రహ్మాండంగా మారాడని చెబుతుంది-పురుష ఏవేదం సర్వం. సృష్టించబడిన జీవులు భగవంతుడిని యజ్ఞరూపుడిగా భావించాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 68 🌹
🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 8. Every Activity is a Psychological Function 🌻
The Cosmic Sacrifice of the Purusha Sukta is an indication to us of the way in which a ritual can become a spiritual meditation, or a spiritual meditation itself can be interpreted as a magnificent ritual. The Brahmanas of the Veda, ritual-ridden as they have been, are brought to a point of contemplative apotheosis in the Aranyakas and the Upanishads, and here it is that every kind of action is identified with a form of sacrifice and action made a part of inward contemplation, so that action becomes a process of thought, rather than a movement of the limbs of the body.
Every activity is a psychological function; it is not just a physical process. This is what we have to understand when we convert action into a contemplation. The originally Existent Being thought an Idea, a Being inseparable from Consciousness. The Purusha Sukta tells us that God became all the Cosmos—purusha evedam sarvam, and the created beings contemplated God as the Original Sacrifice.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios