🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 85 / DAILY WISDOM - 85 🌹
🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 25. విశ్వ చైతన్యం ఆలోచించబడింది 🌻
విశ్వమనస్సు తన స్వయాన్ని ఒక సృష్టి మీద కేంద్రీకరించడం వల్ల ఆ సృష్టి విశ్వంగా రూపుదిద్దుకుంది. ఆ విధంగా విశ్వం ప్రాణం పోసుకుంది. విశ్వంలోని ప్రతి వస్తువులో కార్యాచరణ, శక్తి, మరియు జీవశక్తి ఉన్నాయి. దీనికి కారణం విశ్వ మనస్సు దేశ కాలాలలో బాహ్యంగా ప్రకటితమైన స్థూల ప్రకృతిలో తనను తాను వ్యక్తపరచుకుంది కాబట్టి. ఉద్వేగంతో కూడిన ప్రతి రకమైన అవగాహనలో ఇది జరుగుతుంది. ఉద్వేగం అనేది ఒక వస్తువు పై కేంద్రీకరించి బడిన చైతన్యం. ఆ చైతన్యకేంద్రం దేని కారణంగా నైనా ప్రభావితం అయితే ఆ స్వయం ఆ వస్తువులోకి కదిలి ఆ వస్తువుకి ఒక నిర్దుష్ట విధానంలో జీవం పోస్తుంది.
అప్పుడు, ఆ ప్రాణ ప్రతిష్ట కారణంగా, అది తనలో ఒక భాగం అవుతుంది; ద్వితీయ స్వయం అవుతుంది. ఒక వస్తువు వైపు స్వయం యొక్క ఉద్వేగ పూరిత కదలిక ద్వారా ఆ వస్తువు విషయం యొక్క ద్వితీయ స్వయంగా మారినట్లు, ఆదిలో కూడా జరిగింది. శరీరం చైతన్యంగా మారిన విధంగానే విశ్వ చైతన్యం బాహ్య ప్రకృతి పట్ల దృష్టి సారించడం వల్ల ఆ బాహ్య ప్రకృతి జీవం సంతరించుకుని విశ్వ ప్రక్రితిగా మారింది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 85 🌹
🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 25. The Cosmic Consciousness Contemplated 🌻
It is, as it were, the Cosmic Mind contemplated its own Self in the object which is created, namely, the universe. So, the universe assumed a life. There is activity, energy, force and vitality in everything in the universe. That is because of the projection of the Cosmic Mind into this matter, which is the externalised form in space and in time. This happens in every form of perception involving emotion. An emotion is a form of concentration of consciousness on a particular object, and when that concentration is affected, the self moves to the object and enlivens the object in a particular manner.
Then, because of the enlivenment, it becomes a part of itself; the secondary self does it become. As the individual object becomes a secondary self of an individual subject by way of emotional movement of self towards the object, so did it happen originally, also. The Cosmic Consciousness contemplated on the cosmic externality, which we call Prakriti, and thus the universe assumed life, as if it is consciousness itself, just as the body assumes a form of consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments