top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 90 - 30. Sri Krishna Opened His Mouth, and Fire Came Out of It / నిత్య ప్రజ్ఞా సందేశమ


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 90 / DAILY WISDOM - 90 🌹


🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 30. శ్రీ కృష్ణుడు నోరు తెరిచాడు, దాని నుండి అగ్ని వచ్చింది 🌻


మనం విషయాల యొక్క విశ్వ జనీయతను అర్థం చేసుకున్నప్పుడు, ఇంద్రియాలు ఇప్పుడు మన వ్యక్తిగత సందర్భాలలో ఉన్నట్లు కేవలం ప్రభావం చెందేవిగా కాకుండా ఒక విషయానికి నాంది, కారణాలుగా మారతాయి. దీనిని అర్థం చేసుకోవడం కష్టం. కానీ, ఒకసారి దానిని గ్రహించిన తర్వాత, అన్ని భయాలు ఒక క్షణంలో మాయమవుతాయి, ఎందుకంటే భయం వస్తువులపై ఆధారపడటం వలన వస్తుంది. స్వాతంత్ర్యం అనేది వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంగా మార్చిన తక్షణం వస్తుంది. అది ఉపనిషత్తు చెప్పిన నిజమైన ధ్యానం.


ఈ అధ్యాయం యొక్క ముఖ్య అంశం అయిన ఈ హిరణ్యగర్భంపై ధ్యానం, ఇంద్రియాల శుద్ధీకరణకు, ప్రభావితం చెందడం నుంచి ప్రభావం చూపించేవిగా వాటిలో వచ్చే మార్పుకు కారణం అవుతుంది. ఇది ప్రభావాన్ని పూర్తిగా కారణంగా మారుస్తుంది, తద్వారా వాక్కు అగ్నిగా మారుతుంది, ప్రభావం అవుతుంది. వాస్తవికత యొక్క ఉనికిలో అగ్ని దాని సరైన స్థానాన్ని కనుగొంటుంది. కౌరవుల ఆస్థానంలో శ్రీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించినపుడు, నోరు తెరవగా, అతని నోటి నుండి అగ్ని వచ్చినట్లు చెబుతారు. మరియు, ఉపనిషత్తులో కూడా, ఈ వాస్తవానికి సంబంధించిన సూచనలు మనకు కనిపిస్తాయి.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 90 🌹


🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 30. Sri Krishna Opened His Mouth, and Fire Came Out of It 🌻


When we contemplate the Universal Subjectivity of things, the sense organs become causes rather than effects, not as they are now in our individual cases. What this contemplation means is a hard thing to grasp. But, once it is grasped, all fear vanishes in a moment, because fear is due to dependence on things, and independence is assumed the moment this art of transmuting individual consciousness to the Universal Reality is gained. That is real meditation, in the light of the Upanishad.


And this contemplation, this meditation on Hiranyagarbha, which is actually the subject of this chapter and which is the reason behind the purification of the senses and their overcoming death, completely converts the effect into the cause, so that speech becomes Fire, the effect becomes the cause, and Fire finds its proper place in the Being of Reality. When Sri Krishna opened up His Cosmic Form in the court of the Kauravas, it is said that the mouth opened, and Fire came out of His mouth. And, in the Upanishad also, we find references to this fact.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page