🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 92 / DAILY WISDOM - 92 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 1. మానవత్వానికి ఆదర్శం ఆధ్యాత్మికం 🌻
మానవాళికి ఆదర్శం ఆధ్యాత్మికం. ఈ విషయాన్ని పరిశీలనాత్మకమైన ఏ మనస్సైనా గ్రహిస్తుంది. అన్ని ఆచరణాత్మక పరిశీలనలకు విరుద్ధంగా కనిపించినప్పటికీ, జీవితంలోని భౌతికవాద విధానాలలో కదలికలు కూడా, నిజంగా ఆధ్యాత్మిక భావాన్ని కోల్పోవు. ఇది మనం జీవితం పట్ల వైఖరుల వెనుక ఉన్న ప్రేరణ శక్తులను మానసికంగా గమనించినట్లయితే అర్థమౌతుంది. అత్యంత నీచమైన మనుషుల్లో కూడా ఒక ఆధ్యాత్మిక మూలకం దాగి ఉంటుంది. మానవాళిలో మనం అనేక వృత్తాలలో గమనించే దుర్మార్గపు కదలికలు కొన్నిసార్లు మనకి, సర్వవ్యాపిగా భావించబడే ఆత్మ ఇటువంటి నేరాల వెనుక ప్రేరణగా ఉంటుందా అని అనిపించే అయోమయంలో పడేస్తాయి.
దాని సమాధానం అవును. అతి అల్పమైన సంఘటనలు కూడా ఒక రహస్య ఉద్దేశ్యం కలిగి ఉంటాయి. అయితే బయట కనిపించకపోయినా రహస్యంగా ఉన్న ఉద్దేశం. ఎటువంటి సంఘటనకు సంబంధించి మూల ఉద్దేశమైనా తాను ఎదగాలనుకుంటున్న చైతన్యాన్ని సాధించడమే అయి ఉంటుంది. కానీ అది జీవితపు తుఫానులో మంచిగానైనా చేదుగానైనా పరిణమించవచ్చు. మానవజాతి యొక్క తప్పులు నిజంగా అజ్ఞానం వల్ల జరిగినవి. సత్యం యొక్క అజ్ఞానం ఆ సత్యాన్ని తిరస్కరించడంతో సమానం కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 92 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 1. The Ideal of Humanity is Spiritual 🌻
The ideal of humanity is spiritual. This is a thesis which cannot be set aside by any observant mind. Even where it appears to be the opposite for all practical observations, even in crass materialistic approaches of life, the movements are not really bereft of the spiritual sense, if we are to be psychoanalytically observant of the motive forces behind attitudes to life. Even the worst of men have a spiritual element hiddenly present, and the vicious movements which we observe in humanity in many a circle may sometimes confound us into a doubt as to whether the Spirit which is held to be omnipresent can be the motive force behind these perpetrations.
Yes, is the answer. Even the least of events has a hidden purpose and motive, though not visible outside but covertly present—the motive which rightly or wrongly, by various types of meanderings in the desert of life, directs itself towards awakening into the consciousness of what it is really seeking. The errors of mankind are really the products of ignorance, and an ignorance of a fact cannot be equated with a denial of that fact.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commenti