🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 95 / DAILY WISDOM - 95 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 4. సహకారమే జీవితం యొక్క చట్టం 🌻
చాలా మంది తమను తాము వ్యక్తిగతంగా ‘ధృవీకరించుకోడం ' ద్వారా విజయం సాధించవచ్చనే తప్పుడు భావన వల్ల దుఃఖానికి గురవుతారు. నిజం అందుకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి తప్పుడు భావన ఎందుకు వస్తుందంటే మనలాగే వ్యక్తిగతంగా ధృవీకరంచుకోగల, ఇతరుల వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే అనేక మంది మన చుట్టూనే ఉన్నారనే విషయాన్ని మరచిపోవడం వల్ల. ప్రపంచంలోని తాను కాక 'ఇతరులను' తన అహంతో ఎదిరించిన ఎవరూ జీవితంలో విజయం సాధించలేదు. ప్రతి అహంభావం బయటి నుండి సమానమైన బలమైన అహంభావంతో ఢీ కొంటుంది.
ఒక చర్యలో, వాదనలో లేదా భావనలో ఎల్లప్పుడూ ఒకరిదైన స్వంత దృక్కోణాన్ని తీసుకోవడం వల్ల 'ప్రతిపక్షాన్ని' ఆకర్షిస్తాము. కానీ జీవితానికి కావల్సింది పరస్పర సహకారం కానీ అహంకారం కాదు. అందుకని అహంభావం చివరికి ప్రకృతిలో తప్పక ఓడిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. మనస్సులో, మాటలో లేదా శరీరంలో అన్ని అహంకార చర్యలు ప్రపంచంలోని ఇతర శక్తి కేంద్రాల నుండి అదే విధమైన చర్యను ప్రేరేపిస్తాయి. అలాంటి స్థితిలో జీవించడాన్నే సంసారం అని పిలుస్తారు. నిరంతరం పరస్పరం పోరాడుతున్న అంశాలు ఒకదానికొకటి ప్రతిస్పందించే అనుభవాన్ని కలిగి ఉండి, నిరంతరం బాధని, చాంచలత్వాన్ని తీసుకొస్తాయి.
కొనసాగుతుంది... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 DAILY WISDOM - 95 🌹 🍀 📖 The Ascent of the Spirit 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj 🌻 4.The Law of Life is Cooperation 🌻 Most people come to grief due to the wrong notion that they can succeed by ‘asserting’ themselves. The truth is just the opposite. The false idea that self-assertion can bring success is based on the ignorance of the fact that there are also others in this world who can equally assert themselves and stand against the assertion from any particular individual or centre of action. No one has ever succeeded in life, who confronted the ‘others’ in the world with his ego. All egoism is met with an equally strong egoism from outside. To take always one’s own standpoint, whether in an action, an argument or even in feeling, is to court ‘opposition’, while the law of life is ‘cooperation’. Self-assertion, thus, is contrary to nature’s laws and shall stand defeated in the end. All egoistic action, whether in mind, speech or body, evokes a similar action from other centres of force in the world and to live in such a condition is fitly called samsara, and experience in which perpetually warring elements react against one another and bring about restlessness and pain. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comentários