🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 96 / DAILY WISDOM - 96 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻5. ఆదర్శం యొక్క దృక్కోణం నుండి ప్రతిదీ వివరించడం 🌻
ఆధ్యాత్మిక జీవితం అంటే మీ నడవడిక లేదా జీవన విధానం మరియు ఆలోచనా విధానం మరియు అర్థం చేసుకునే విధానాలైన ప్రతి కోణం ఉన్నత ఆదర్శాల దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడం. ఇది భౌతిక, సామాజిక, నైతిక, రాజకీయ లేదా మానసిక - జీవితంలోని ఏ పరిస్థితైనా కావచ్చు. ఇది ప్రస్తుతం మీకు అర్థం కాని, భవిష్యత్తులో మాత్రమే అనుభూతి లోకి వచ్చే ఆదర్శమే కావచ్చు. కానీ అది ఇప్పుడు మిమ్మల్ని ఆ ఆదర్శాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నానికి అడ్డు కాకూడదు. ఒకవేళ మీరు ఆ కారణంగా ఆ ఆదర్శాన్ని కనుక చేరుకునే ప్రయత్నం చేయకపోతే, మీరు అసంపూర్ణ మానవుల లాగా మిగిలిపోతారు. అది మిమ్మల్ని అసంతృప్తిగా ఉంచుతుంది.
ఈ విషయంలో జంతు స్వభావం మాత్రమే అసమర్థమైనది కానీ మానవ స్వభావం కాదు. జంతువులు మరియు జంతు స్వభావం ఉన్న మానవులు కూడా ప్రస్తుత స్థితికి అతీతమైన ఆదర్శ కోణం నుండి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోలేరు. ఉన్నతమైన వాటి వెలుగులో దిగువను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని మనం ఒకసారి మేల్కొలుపుతే, అప్పుడు మాత్రమే మనం నిజమైన మానవులుగా పిలవబడవచ్చు. ఎందుకంటే జంతువులపై మానవులకు ఉన్న ఆధిక్యత ఈ ప్రత్యేకత లోనే ఉంది. కేవలం రెండు కాళ్లతో నడిచినందున, ఒక వ్యక్తిని నిజమైన మనిషిగా పరిగణించాల్సిన అవసరం లేదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 96 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻5. Interpreting Everything from the Point of View of the Ideal 🌻
A spiritual life is that conduct or way of living and mode of thinking and understanding which enables one to interpret every situation in life—physical, social, ethical, political or psychological—from the point of view of the ideal that is above and is yet to be reached, notwithstanding the fact that it is a remote ideal in the future. The inability to interpret the practical affairs of life, and the present state of existence in terms of the higher ideal immediately succeeding, would make us incomplete human beings and keep us unhappy.
It is only the animal nature that is incapacitated in this respect. The animals and even human beings who have the animal nature preponderating in them cannot interpret present situations from the point of view of the ideal that is transcendent to the present state. And once we are awakened to the capacity of being able to understand and interpret the lower in the light of the higher, then it is that we can be called real humans, for the superiority of humans over animals lies just in this special endowment. Merely because one walks with two legs, one need not necessarily be regarded as truly human.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments