top of page
Writer's picturePrasad Bharadwaj

Osho Daily Meditations - 310. TWILIGHT / ఓషో రోజువారీ ధ్యానాలు - 310. సంధ్యా సమయం



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 310 / Osho Daily Meditations - 310 🌹


✍️. ప్రసాద్ భరద్వాజ


🍀 310. సంధ్యా సమయం 🍀


🕉. సంధ్యా సమయాన్ని ఉపయోగించు కోవడం ద్వారా చాలా మంది ఉనికిలో ఎదిగారు. 🕉


భారతదేశంలో, సంధ్య అనే పదం ప్రార్థనకు పర్యాయపదంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్న ఒక సనాతన హిందువు దగ్గరకు వెళితే, 'నేను సంధ్య చేస్తున్నాను--నేను నా ప్రార్థనను సంధ్యా సమయంలో చేస్తున్నాను' అని అంటాడు. సూర్యోదయానికి ప్రకృతిలో గొప్ప మార్పు కనిపిస్తుంది. మొత్తం నిష్క్రియ ఉనికి చురుకుగా మారుతుంది. నిద్ర విచ్ఛిన్నమవుతుంది; కలలు కనుమరుగవుతాయి. అంతటా జీవితం మళ్లీ పుడుతుంది. ఇది పునరుత్థానం. ఇది ప్రతిరోజూ జరిగే ఒక అద్భుతం.


ఆ క్షణంలో దానితో తేలియాడేలా మిమ్మల్ని మీరు అనుమతించుకుంటే, మీరు చాలా ఉన్నత శిఖరానికి ఎదగవచ్చు. సూర్యుడు అస్తమించినప్పుడు కూడా అదే మార్పు మళ్లీ జరుగుతుంది. అంతా నిశ్శబ్దం, ప్రశాంతత. ఒక ప్రశాంతతని, గాఢమైన నిశ్శబ్దాన్ని ఉనికిలో వ్యాపింప జేస్తుంది. ఆ క్షణంలో, మీరు చాలా లోతులకు చేరుకోవచ్చు. ఉదయం మీరు చాలా గొప్ప ఎత్తులకు చేరుకోవచ్చు; సాయంత్రం మీరు చాలా లోతైన లోతులకు చేరుకోవచ్చు మరియు రెండూ అందంగా ఉంటాయి. పైకి లేదా చాలా లోతుకు వెళ్లండి. రెండు విధాలుగా మిమ్మల్ని మీరు అధిగమించ గలరు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 310 🌹


📚. Prasad Bharadwaj


🍀 310. TWILIGHT 🍀


🕉. Many people have entered into existence through twilight. 🕉


In India, the word sandhya--twilight-has become synonymous with prayer. If you approach an orthodox Hindu who is praying, he will say, "I was doing sandhya--I was doing my twilight." When the sun rises, just before sunrise, there is a great change. The whole passive existence becomes active. Sleep is broken; dreams disappear. The trees and birds and life everywhere arise again. It is a resurrection. It is a miracle every day.


If you allow yourself to float with it in that moment, you can rise to a very high peak. And the same change happens again when the sun sets. Everything quiets, calms. A tranquility, a deep silence, pervades existence. In that moment, you can reach to the very depths. In the morning you can reach to very great heights; in the evening you can reach to very deep depths, and both are beautiful. Either go high or very deep. In both ways you transcend yourself.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page