🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 331 / Osho Daily Meditations - 331 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 331. ప్రార్థన 🍀
🕉. నేర్చుకుని నిర్వహించే ప్రార్ధనని విడిచి పెట్టాలి. ప్రార్ధన అనేది ఆకస్మిక ప్రవాహంగా ఉండాలి. 🕉
చాలా మంది ప్రజలు చర్చిలలో, దేవాలయాలలో ప్రార్థనలు చేస్తారు కానీ ఏమీ జరగదు; ఇకపైన కుడా ఏమీ జరగదు. వారు అనేక జన్మలు ప్రార్థించవచ్చు కానీ ఏమీ జరగదు, ఎందుకంటే వారి ప్రార్థన సహజంగా వచ్చినది కాదు. వారు దానిని నిర్వహిస్తున్నారు; అది మనస్సు ద్వారా. వారు చాలా తెలివైనవారు, కానీ ప్రార్థన పనిచేయాలంటే మీరు
మూర్ఖులు కావాలి. ప్రార్థన ఒక మూర్ఖత్వం. మీరు దేవునితో మాట్లాడు తున్నారని మీకు ఇబ్బందిగా కూడా అనిపించ వచ్చు. ఇది మూర్ఖత్వంలా ఉండాలి, కానీ అది పని చేస్తుంది.
మూర్ఖత్వం జ్ఞానం, మరియు జ్ఞానం మూర్ఖత్వం అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థన అవసరమని మీకు అనిపించినప్పుడల్లా, దానిని ఉపయోగించండి. మీరు దీన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. మరియు ధ్యానం నుండి మీ ప్రార్థన తీవ్రమవుతుంది. మీరు లోపల ప్రార్థించినపుడు శరీరంలో ఏదైనా జరిగితే, అది ఏమైనా సరే అనుమతించండి. శరీరానికి ఏదైనా కదలిక వచ్చినా, ఏదైనా శక్తి శరీరంలో కదలటం మొదలయినా లేదా మీరు ఒక బలమైన గాలికి చిన్న ఆకులా మారినా, ప్రార్థన చేసి దానిని అనుమతించండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 331 🌹
📚. Prasad Bharadwaj
🍀 331. PRAYER 🍀
🕉. Prayer should be unlearned; it should be spontaneous. 🕉
Many people pray in the churches, in the temples, and nothing happens; nothing is going to happen. They can go on praying for lives together and nothing will happen, because their prayer is not spontaneous. They are managing it; it is through the mind. They are too wise, and for a prayer to function you have to be a fool. Prayer is foolish--you may even feel awkward that you are talking to God. It is foolish, but it works.
There are times when foolishness is wisdom, and wisdom is foolishness. So whenever you feel a moment when prayer is needed, use it. The more you use it, the more it will become available. And out of meditation your prayer will deepen. You pray inside, and if something happens in the body, allow it, whatever it is. If any movement comes to the body, any energy starts waving in the body or if you become like a small leaf in a strong wind, just pray and allow it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires