🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 347 / Osho Daily Meditations - 347 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 347. సహకారం 🍀
🕉. డార్విన్ ఎవల్యూషన్ మరియు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గురించి తన థీసిస్ వ్రాసినప్పుడు, మరొక వ్యక్తి, ప్రిన్స్ క్రోపోట్కిన్ ఇఫ్ రష్యా, పూర్తిగా వ్యతిరేకమైన థీసిస్‌ను వ్రాసాడు: పరిణామం సహకారం ద్వారా జరుగుతుంది అని. 🕉
ప్రిన్స్ క్రోపోట్కిన్ గురించి ప్రజలు పెద్దగా వినలేదు మరియు అతని సిధ్ధాంతం డార్విన్ కంటే చాలా గొప్పది. దీనికి సమయం పడుతుంది, కానీ అతను డార్విన్పై విజయం సాధిస్తాడు. సంఘర్షణ ద్వారా పరిణామం చెందుతుందనే ఆలోచన హింసాత్మకమైనది. అది చాలా భ్రష్టమైన ఆలోచన. మీరు డార్విన్ దృష్టిలో చూస్తే, జీవితంలో కేవలం పోరాడే పటిమ ఉన్నవాడే బతుకుతాడు. ఇది అత్యంత వినాశకరమైనది, అత్యంత దూకుడుగా ఉంటుంది. కాబట్టి ఈ పోరాట సమర్థతకు విలువ లేదు; అతను మానవుడు కూడా కాదు. అత్యంత జంతు రూపంలో ఉండే వాడు. - ఈ విధంగా ఒక అత్యుత్తముడు, గాడ్ మాన్ బ్రతకలేడు, అతను ఆ పటిమ గలవాడు కాదు. బుద్ధుడు మనుగడ సాగించలేడు, అతను సమర్థుడు కాదు, బుద్ధుడు అత్యంత నిస్సహాయుడు. కానీ ఒక అలెగ్జాండర్ బ్రతుకుతాడు, హిట్లర్ బ్రతుకుతాడు, స్టాలిన్ బ్రతుకుతాడు, మావో బ్రతుకుతాడు.
కానీ అప్పుడు హింస మాత్రమే మనుగడలో ఉంటుంది, ప్రేమ కాదు. హత్య మాత్రమే మిగిలి ఉంటుంది, ధ్యానం కాదు. డార్వినియన్ దృష్టి జీవితం గురించి చాలా అమానవీయమైన ధ్యానం. మీరు అడవిలోకి వెళ్లి డార్వినియన్ కళ్ళలో చూస్తే, మీరు ప్రతిచోటా సంఘర్షణను చూస్తారు: జాతులు ఇతర జాతులను నాశనం చేస్తాయి, ప్రతి ఒక్కరూ సంఘర్షణలో ఉంటారు. ఇది ఒక పీడకల. మరియు మీరు అదే అడవికి వెళ్లి క్రోపోట్కిన్ కళ్ళ ద్వారా చూస్తే, అద్భుతమైన సహకారం ఉంది. ఈ జాతులు లోతైన సహకారంతో జీవిస్తాయి, లేకుంటే ఎవరూ జీవించి ఉండలేరు. హింస భాగం కావచ్చు, కానీ మొత్తం కాదు; లోతైన సహకారం ఉంది. మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారో, అంత తక్కువ హింస మరియు మరింత ఎక్కువ సహకారం ఉంటుంది. అది ఎదుగుదల నిచ్చెన.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 347 🌹
📚. Prasad Bharadwaj
🍀 347. COOPERATION🍀
🕉. When Darwin wrote his thesis about evolution and the survival of the fittest, another man, Prince Kropotkin in Russia, was writing a quite diametrically opposite thesis: that evolution happens through cooperation. 🕉
People have not heard much about Prince Kropotkin, and his thesis is far superior to Darwin's. It will take time, but he will win over Darwin. The very idea that one evolves through conflict is violent; it is a very lopsided idea. If you look through the eyes of Darwin, life is just a survival of the fittest. And who is the fittest? The most destructive, the most aggressive is the fittest. So the fittest has no value; it is not even human--the fittest is the-one who is the most animal-like. Godman cannot survive, he is not the fittest. Buddha cannot survive, he is not the fittest, Buddha will be the most helpless man. Then Alexander survives, Hitler survives, Stalin survives, Mao survives; these are the fittest.
Then only violence survives, not love. Only murder survives, not meditation. The Darwinian vision is a very inhuman meditation about life. If you go into the forest and look through Darwinian eyes, you will see conflict everywhere: species destroying other species, everybody in conflict. It is a nightmare. And if you go to the same forest and look through the eyes of Kropotkin, there is tremendous cooperation. These species have been living in deep cooperation, otherwise nobody would have survived. Violence may be part, but is not the whole; deep down is cooperation. And the higher you grow, the less and less violence the more and more cooperation there is. That is the ladder of growth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments