🌹.అక్షయ తృతీయ 🌹
🌿వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు.23 ఏప్రిల్ 2023 అక్షయ తృతీయ.
🌸ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది.
🌿స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం
🌸1. పరశురాముని జన్మదినం.
🌿2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.
🌸3. త్రేతాయుగం మొదలైన దినం.
🌿4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.
🌸5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.
🌿6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.
🌸7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.
🌿8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.
🌸9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.
🌿10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
🌸అక్షయ తృతీయ నాడు , మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా , (అది పుణ్యం కావచ్చు , లేదా పాపం కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది.
🌿 పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా , ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ , కూజాలో గానీ , మంచి నీరు పోసి , దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే , ఎన్ని జన్మలలోనూ , మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు.
🌸అతిధులకు , అభ్యాగతులకు , పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే , ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.
🌿అర్హులకు స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు సమర్పించుకుంటే , మన ఉత్తర జన్మలలో , వాటికి లోటు రాదు. గొడుగులు , చెప్పులు , విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు.
🌸ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు...స్వస్తీ.
コメント