ఆరోపణ బుద్ధి Accusative mind
- Prasad Bharadwaj
- Mar 24, 2023
- 1 min read

🌹. ఆరోపణ బుద్ధి 🌹
శ్రీగురుభ్యోనమః🙏
సాధకులలో కొంతమంది సద్గురువు వద్దకు వెళ్లి మేము చాలా సేవ చేస్తున్నాము కదా! మాకెందుకీ బాధలు, కష్టాలు అని ప్రశ్నించెదరు. ఇటువంటి సత్యభామ బుద్ధి (ఆరోపణ బుద్ధి) మానుకొనుట ఉత్తమము. మీరు పిలిస్తే సద్గురువు వస్తాడు. కాని మీ బాధలు, ఆరోపణలు సద్గురువు రాకను గుర్తింపనీయవు. సద్గురువు నుంచి అనంత ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ప్రసరించుచునే ఉండును.
బాధలలో ఉన్నప్పుడు సద్గురువు బోధనలు చదువుతుండవలెను. యోగమున నిలిచి సేవను పెంచుకొన వలెను. సద్గురువుతో అనుసంధానము పెంచుకొనవలెనే గాని, ఆరోపణలతో త్రెంపుకొన రాదు. లేనియెడల మీ చేతన ఘర్షణకు గురి అగును.
🌹🌹🌹🌹🌹
コメント