🌹. కపిల గీత - 127 / Kapila Gita - 127🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 🌴
11. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|
ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥
తాత్పర్యము : ఆత్మ దేహాది ఉపాధులకంటే వేరైనది. ఐనను అహంకారాది మిథ్యావస్తువుల యొక్క సాంగత్య కారణముగా ఈ దేహాదులు సత్యముగనే భాసించును. ఆ పరమాత్మ జగత్కారణ భూతమైన ప్రకృతికి అధిష్ఠాత - మహదాది కార్యవర్గముసు ప్రకాశింప జేయువాడు. కార్యకారణ రూపమగు సకల పదార్థముల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు.
వ్యాఖ్య : లింగమంటే దేహం. మనమే పేరు పెట్టినా, ఆ పేరు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఎపుడైతే పరమాత్మ స్వరూప జ్ఞ్యానం అవగతమవుతుందో, అపుడు దేహాసక్తి పోతుంది. అప్పుడు ముక్తలింగుడవుతాడు. ఆత్మ ఉంది అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతున్న శరీరం మీద అనుబంధం వదిలి పెట్టబడుతుంది. దేవ తిర్యక్ మనుష్యాది బుద్ధిని విడిచిపెడతాడు. ఇది ముక్త లింగః - జీవుడు. ఇది పరమాత్మ జ్ఞ్యానం కలిగిన ఆత్మ జ్ఞ్యాని ప్రవర్తించే విధానం. దేహం యందు అభిమతి పోతుంది.
అలా అయిన తరువాత, ఎప్పుడు సత్ గానే ప్రకాశించే, ఉత్పత్తీ వినాశం లేని, సంకోచ వికాసమూ లేనీ, జీవాత్మకు బంధువైన, దేహాన్ని చూపేవాడైన, ప్రతీ వానిలోనూ (జీవుడిలోనూ, శరీరములోనూ) అంతర్యామిగా ఉండేవాడు, అద్వయం (రెండవ వాడైన వాడు లేని వాడు) ఐన వాడు అయిన పరమాత్మను దేహమునందు చూడగలడు. పరమాత్మ అనుగ్రహంతో ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడు, తెలుసుకున్న ఆత్మ స్వరూపముతో, లేనట్లుగా, అంతవరకూ ఉన్నట్లు అనిపించిన, అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరములోనే, ఈ దేహములోనే పరమాత్మను చూస్తాడు. ప్రకృతి కంటే విడిగా ఉన్న ఆత్మను చూస్తాడు, ఆత్మకన్నా వేరుగా ఉన్న పరమాత్మను కూడా చూస్తాడు. దేహముగా అంతర్యామిగా ఉన్న ఆత్మలో, అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేతనే, 1. ఆత్మ జ్ఞ్యానమూ 2. పరమాత్మ జ్ఞ్యానమూ 3. దేహజ్ఞ్యానమూ కలుగుతాయి. ఇంద్రియములచే చూడదగని ఆత్మను శరీరముతో ఎలా చూడగలడు. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని మొదట ఎలా తెలుసుకోవాలి?
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 127 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴
11. mukta-liṅgaṁ sad-ābhāsam asati pratipadyate
sato bandhum asac-cakṣuḥ sarvānusyūtam advayam
Meaning : A liberated soul realizes the Absolute Personality of Godhead, who is transcendental and who is manifest as a reflection even in the false ego. He is the support of the material cause and He enters into everything. He is absolute, one without a second, and He is the eyes of the illusory energy.
PURPORT : A pure devotee can see the presence of the Supreme Personality of Godhead in everything materially manifested. He is present there only as a reflection, but a pure devotee can realize that in the darkness of material illusion the only light is the Supreme Lord, who is its support. It is confirmed in Bhagavad-gītā that the background of the material manifestation is Lord Kṛṣṇa. And, as confirmed in the Brahma-saṁhitā, Kṛṣṇa is the cause of all causes. In the Brahma-saṁhitā it is stated that the Supreme Lord, by His partial or plenary expansion, is present not only within this universe and each and every universe, but in every atom, although He is one without a second. The word advayam, "without a second," which is used in this verse, indicates that although the Supreme Personality of Godhead is represented in everything, including the atoms, He is not divided. His presence in everything is explained in the next verse.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires