top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 128 / Kapila Gita - 128


🌹. కపిల గీత - 128 / Kapila Gita - 128🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 12 🌴


12. యథా జలస్థ ఆభాసః స్థలస్థేనావదృశ్యతే|

స్వాభాసేన యథా సూర్యో జలస్థేన దివి స్థితః॥


తాత్పర్యము : జలముల యందు ప్రతిబింబించుచున్న సూర్యబింబము గోడపై పడినప్పుడు అది జలముల యందు సూర్య ప్రతిబింబమునకు అభాస మాత్రమే. జలములలో కనబడు ప్రతిబింబము ద్వారా ఆకాశము నందలి సూర్యుడు తెలియ బడుచున్నాడు. అలాగే శరీరములో ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే, "ఇది ఆత్మా", అని చెబుతాడు, అది ఉన్న శరీరం ఆభాసమూ అని చెబుతాడు, ఆ శరీరములో ఉన్న తననీ చూపుతాడు.


వ్యాఖ్య : నీటిలో సూర్య ప్రతిబింబాన్ని చూస్తున్నాము. అన్నిటినీ చూపే వెలుగుతోటే నీటిలో ఉన్న సూర్యుని చూస్తున్నాము. ఆకాశములో ఉన్న సూర్యుని చేతనే నీటిలో ఉన్న సూర్యున్నీ చూస్తున్నాము. సూర్యభగవానుడే నీటి ప్రతిబింబాన్నీ చూపుతాడూ, ఆ సూర్యభగవానుడే, తన నిజమైన స్వరూపాన్నీ చూపుతాడు. అలాగే, దేహములో ఆత్మ స్వరూపాన్ని, ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే చూపుతాడు. ఆత్మలోని పరమాత్మ జ్ఞ్యానమూ, ఆత్మలోని పరమాత్మ వలన కలిగే ఆత్మ జ్ఞ్యానమూ, ఈ రెండూ పరమాత్మ వలననే కలుగుతాయి. శరీరములో ఉన్న ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మే, "ఇది ఆత్మా", అని చెబుతాడు, అది ఉన్న శరీరం ఆభాసమూ అని చెబుతాడు, ఆ శరీరములో ఉన్న తననీ చూపుతాడు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 128 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 12 🌴


12. yathā jala-stha ābhāsaḥ sthala-sthenāvadṛśyate

svābhāsena tathā sūryo jala-sthena divi sthitaḥ


MEANING : The presence of the Supreme Lord can be realized just as the sun is realized first as a reflection on water, and again as a second reflection on the wall of a room, although the sun itself is situated in the sky.


PURPORT : The example given herewith is perfect. The sun is situated in the sky, far, far away from the surface of the earth, but its reflection can be seen in a pot of water in the corner of a room. The room is dark, and the sun is far away in the sky, but the sun's reflection on the water illuminates the darkness of the room. A pure devotee can realize the presence of the Supreme Personality of Godhead in everything by the reflection of His energy. In the Viṣṇu Purāṇa it is stated that as the presence of fire is understood by heat and light, so the Supreme Personality of Godhead, although one without a second, is perceived everywhere by the diffusion of His different energies. It is confirmed in the Īśopaniṣad that the presence of the Lord is perceived everywhere by the liberated soul, just as the sunshine and the reflection can be perceived everywhere although the sun is situated far away from the surface of the globe.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page