top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 129 / Kapila Gita - 129


🌹. కపిల గీత - 129 / Kapila Gita - 129🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 13 🌴


13. ఏవం త్రివృదహంకారో భూతేంద్రియమనోమయైః|

స్వాభో సైర్లక్షితోఽనేన సదాభాసేన సత్యదృక్॥


తాత్పర్యము : సాత్త్విక, రాజస, తామసములనెడి మూడు విధములగు అహంకారముల కార్యములగు దేహ ఇంద్రియ మనస్సుల యందు ఆత్మ ప్రతిబింబము అనుభవమునకు వచ్చును. అది అహంకారము నందలి పరమాత్మయొక్క ప్రతిబింబమే అని తెలిసినప్పుడు తద్ద్వారా పరమాత్మయొక్క నిజస్వరూపము బోధపడును. ఈ విధముగా సత్య వస్తువువలె భాసించు అసద్వస్తువు ద్వారా సత్యవస్తువు అనుభవమునకు వచ్చును అని స్పష్టమగుచున్నది.


వ్యాఖ్య : తివృత్ అయిన అహంకారం (సత్వ రజ తమో గుణాలతో కూడి ఉన్న,), పంచ భూతాలు, జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలతో కూడి ఉన్న అహంకారం. అహంకారమునకే త్రివృత్ అని పేరు. శరీరమే ఆత్మ అనే భ్రమ కలగడానికి అహంకారమే కారణం. శరీరములో ఇంద్రియములో మనసులో ఆత్మ బుద్ధిని చూపుతుంది. ఏ జ్ఞ్యానమైతే దేహాత్మ జ్ఞ్యానముని కలిగిస్తుందో, అదే జ్ఞ్యానం పరమాత్మ అనుగ్రహం కలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. అన్ని వికారాలకు మూలైమైన దేహాత్మాభిమానం మాయమై, సత్యమైన, నిర్వికారమైన, జ్ఞ్యాన స్వరూపమైన ఆత్మను అహంకారమే చూపుతుంది. పరమాత్మ సాక్షాత్కారమయ్యే దాకా, దేహాన్ని చూపే అహంకారం, పరమాత్మ సాక్షాత్కారమయ్యాక, ఆత్మను చూపుతుంది. ఆత్మ జ్ఞ్యానం కలిగేది పరమాత్మ వలననే. అహంకారం కలిగేది కూడా పరమాత్మ వలననే. యధార్థ జ్య్నానమైనా భ్రాంతి అయినా పరమాత్మ వల్లే కలగాలి. నీటిలో సూర్యుడు కానిదైన సూర్యబింబాన్ని చూపేది సూర్యుడే, అలాగే నిజమైన సూర్యున్ని చూపేది కూడా సూర్యుడే. అలాగే ఆత్మ కాని దాన్ని ఆత్మా అని చూపే పరమాత్మే, ఆత్మ స్వరూప జ్ఞ్యానాన్నీ చూపుతాడు.


సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 129 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 13 🌴


13. evaṁ trivṛd-ahaṅkāro bhūtendriya-manomayaiḥ

svābhāsair lakṣito 'nena sad-ābhāsena satya-dṛk


MEANING : The self-realized soul is thus reflected first in the threefold ego and then in the body, senses and mind. When one is reflected through the material contamination of the body and mind in false identification, he is in the conditional state, but when he is reflected in the pure stage he is called liberated.


PURPORT : The conditioned soul thinks, "I am this body," but a liberated soul thinks, "I am not this body. I am spirit soul." This "I am" is called ego, or identification of the self. "I am this body" or "Everything in relationship to the body is mine" is called false ego, but when one is self-realized and thinks that he is an eternal servitor of the Supreme Lord, that identification is real ego. One conception is in the darkness of the threefold qualities of material nature—goodness, passion and ignorance—and the other is in the pure state of goodness, called śuddha-sattva or vāsudeva. When we say that we give up our ego, this means that we give up our false ego, but real ego is always present. When one is reflected through the material contamination of the body and mind in false identification, he is in the conditional state, but when he is reflected in the pure stage he is called liberated.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page