top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 132 / Kapila Gita - 132


🌹. కపిల గీత - 132 / Kapila Gita - 132 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 16 🌴


16. ఏవం ప్రత్యవమృశ్యాసావాత్మానం ప్రతిపద్యతే|

సాహంకారస్య ద్రవ్యస్య యోఽవస్థానమనుగ్రహః॥

తాత్పర్యము : తల్లీ! వివేకి ఈ విషయములను అన్నింటిని మననము చేసికొనుచు ఆత్మానుభవమును పొందును. అహంకార సహితమైన తత్త్వములను అన్నింటికిని ఆత్మయే అధిష్ఠాత. మరియు వాటిని అన్నింటికిని ఆత్మయే అధిష్ఠాత. మరియు వాటిని అన్నింటినీ ప్రకాశింప జేయువాడు గూడ అతడే. వ్యాఖ్య : ఇలా నిద్రపోతున్నవాడు, తన నిద్రా స్వరూపాన్ని ఈ రీతిలో తెలుసుకుని, "ఎప్పుడూ ఉండేధీ, సత్యమైంది ఆత్మ " అని తెలుసుకుని, ఇలా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. శరీరం పంచభూత సముదాయమైనది (సాహఙ్కారస్య ). ఈ శరీరం ఉండేది ఎవరి దయ వలన? ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఆత్మ అనుగ్రహిస్తేనే శరీరం ఉంటుంది. లోపల ఆత్మ లేకుంటే శరీరం పని చేయదూ, శరీరానికి ఉనికే లేదు. అహంకారముతో కూడి ఉన్న పంచ జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియములతో కూడిన ఈ అవస్థానం ఆత్మ యొక్క అనుగ్రహమే. నిద్రపుచ్చేదీ, మేలుకొలిపేదీ ఆత్మే. ఇవన్నీ చేస్తున్న ఆత్మ, వీటన్నిటిలో ఒక భాగమా, వేరా? వీటిలో ఒక భాగమైతే ఆత్మకు కూడా నిద్ర ఉండాలి. ఆత్మ వీటికన్నా వేరు. ఏ ఆత్మకు ఏ శరీరము రావాలో చెప్పే పని మాత్రం పరమాత్మది. శరీర సంబంధం వచ్చిన తరువాత, శరీరము నేనే అనే భ్రమ దేహేంద్రియాలతో వస్తుంది. అ భ్రమను విరక్తితో భక్తితో సత్సేవతో పోగొట్టుకోవాలి. సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Kapila Gita - 132 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 16 🌴 16. evaṁ pratyavamṛśyāsāv ātmānaṁ pratipadyate sāhaṅkārasya dravyasya yo 'vasthānam anugrahaḥ MEANING : When, by mature understanding, one can realize his individuality, then the situation he accepts under false ego becomes manifest to him. PURPORT : The Māyāvādī philosophers' position is that at the ultimate issue the individual is lost, everything becomes one, and there is no distinction between the knower, the knowable and knowledge. But by minute analysis we can see that this is not correct. Individuality is never lost, even when one thinks that the three different principles, namely the knower, the knowable and knowledge, are amalgamated or merged into one. The very concept that the three merge into one is another form of knowledge, and since the perceiver of the knowledge still exists, how can one say that the knower, knowledge and knowable have become one? The individual soul who is perceiving this knowledge still remains an individual. Both in material existence and in spiritual existence the individuality continues; the only difference is in the quality of the identity. In the material identity, the false ego acts, and because of false identification, one takes things to be different from what they actually are. That is the basic principle of conditional life. Similarly, when the false ego is purified, one takes everything in the right perspective. That is the state of liberation. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page