top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 137 / Kapila Gita - 137


🌹. కపిల గీత - 137 / Kapila Gita - 137 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 21 🌴


21. శ్రీభగవానువాచ


అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణామలాత్మనా|

తీవ్రయా మయి భక్త్యా చ శ్రుతసంభృతయా చిరమ్॥


తాత్పర్యము : శ్రీ కపిలభగవానుడు నుడివెను - తల్లీ! అగ్నికి ఉత్పత్పి స్థానమైన అరణి,తన నుండి ఉత్పన్నమైన అగ్నివలన కాలి బూడిదయగును. అట్లే నిష్కామభావముతో చేసిన స్వధర్మాచరణముద్వారా అంతఃకరణము పరిశుద్ధమై చాలాకాలము భగవత్కథాశ్రవణము ద్వారా దృఢపడిన భక్తివలనను,


వ్యాఖ్య : పరమాత్మను ఎలా ఆరాధించాలి? కేవలం భక్తితోనేనా? ఉపాంగములతో కూడిన భక్తి. అంటే కర్మ, జ్ఞ్యానమూ, భక్తి, ప్రపతీ, అవతార రహస్య జ్ఞ్యానం. ఇన్ని యోగములతో కూడిన భక్తితో ఆరాధించబడిన పరమాత్మ ప్రసన్నుడై, అనుగ్రహించి మనను, తాను ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూప జ్ఞ్యానాన్ని కలిగిస్తే, అది కలిగిన తరువాత, ఆయన అనుగ్రహముతో ఆయనను పొందుతాము. పరమాత్మ అనుగ్రహం కలిగిన తరువాత ప్రకృతి మనని విడిచిపెడుతుంది. ఈ భక్తి యోగానికి అంగాలుగా ఉన్న మిగతా యోగాలు కూడా అర్థంకావాలి.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 137 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 21 🌴


21. śrī-bhagavān uvāca


animitta-nimittena sva-dharmeṇāmalātmanā

tīvrayā mayi bhaktyā ca śruta-sambhṛtayā ciram


MEANING : The Supreme Personality of Godhead said: One can get liberation by seriously discharging devotional service unto Me and thereby hearing for a long time about Me or from Me. By thus executing one's prescribed duties, there will be no reaction, and one will be freed from the contamination of matter.


PURPORT : Śrīdhara Svāmī comments in this connection that by association with material nature alone one does not become conditioned. Conditional life begins only after one is infected by the modes of material nature. If someone is in contact with the police department, that does not mean that he is a criminal. As long as one does not commit criminal acts, even though there is a police department, he is not punished. Similarly, the liberated soul is not affected, although he is in the material nature. Even the Supreme Personality of Godhead is supposed to be in association with material nature when He descends, but He is not affected. One has to act in such a way that in spite of being in the material nature he is not affected by contamination. Although the lotus flower is in association with water, it does not mix with the water. That is how one has to live, as described here by the Personality of Godhead Kapiladeva (animitta-nimittena sva-dharm eṇāmalātmanā). One can be liberated from all adverse circumstances simply by seriously engaging in devotional service.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comentários


bottom of page