top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 148 / Kapila Gita - 148


🌹. కపిల గీత - 148 / Kapila Gita - 148 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 02 🌴


02. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనమ్|

దైవాల్లబ్దేన సంతోష ఆత్మవిచ్చరణార్చనమ్॥


తాత్పర్యము : దీని కొరకై శాస్త్ర విహిత ధర్మములను యథాశక్తిగా ఆచరింపవలెను. శాస్త్ర విరుద్ధమైన కర్మలను పరిత్యజింప వలయును. ప్రారబ్ధానుసారము (దైవానుగ్రహముస) లభించిన దానితో తృప్తి చెందవలయును. ఆత్మజ్ఞానుల పాదములను సేవింప వలెను. అనగా వారి సమీపముననే యుండి వారి సత్సాంగత్య లాభములను పొందవలెను.


వ్యాఖ్య : ఈ శ్లోకం నిరంతరం అనుసంధానం చేయాలి. మనసు ప్రశాంతతను పొందాలీ అంటే తన ధర్మాన్ని తాను శక్తి మేరకు ఆచరించాలి. ధర్మము కాని దాని నుండి వైదొలగాలి. స్వధర్మమే ఫలమును కోరిచేస్తే విధర్మమవుతుంది. భగవదాజ్ఞ్యయా భగవత్కైంకర్య రూపేణా కర్మలు చేయాలి. అవిహిత అప్రతిషిద్ధ నిషిద్ధ వ్యాపారాలు విధర్మం. నిషేధించిన దాన్ని విడిచిపెట్టాలి, ఏ ఏ పని చేయకూడదని చెప్పలేదో దాన్ని కూడా విడిచిపెట్టాలి. వీటినుండి తొలగడానికి పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పొందాలి. అలా తృప్తి చెందడం వలన విధర్మ నివృత్తి కలుగ్తుంది. మరి పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తి చెందాలంటే? మనసు కడగబడాలి. అది భాగవత ఆరాధనతో కలుగుతుంది. భగవంతుని భక్తులని ఆరాధిస్తే, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడడం అలవాటవుతుంది. అంటే భగవంతుని భక్తులూ అనడానికి చిహ్నం, వారు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడే వారు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 148 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 4. Features of Bhakti Yoga and Practices - 02 🌴


02. sva-dharmācaraṇaṁ śaktyā vidharmāc ca nivartanam

daivāl labdhena santoṣa ātmavic-caraṇārcanam


MEANING : One should execute his prescribed duties to the best of his ability and avoid performing duties not allotted to him. One should be satisfied with as much gain as he achieves by the grace of the Lord, and one should worship the lotus feet of a spiritual master.


PURPORT : In this verse there are many important words which could be very elaborately explained, but we shall briefly discuss the important aspects of each. The final statement is ātmavic-caraṇārcanam. Ātma-vit means a self-realized soul or bona fide spiritual master. Unless one is self-realized and knows what his relationship with the Supersoul is, he cannot be a bona fide spiritual master. Here it is recommended that one should seek out a bona fide spiritual master and surrender unto him (arcanam), for by inquiring from and worshiping him one can learn spiritual activities.


The first recommendation is sva-dharmācaraṇam. As long as we have this material body there are various duties prescribed for us. Such duties are divided by a system of four social orders: brāhmaṇa, kṣatriya, vaiśya and śūdra. These particular duties are mentioned in the śāstra, and particularly in Bhagavad-gītā. Sva-dharmācaraṇam means that one must discharge the prescribed duties of his particular division of society faithfully and to the best of his ability. One should not accept another's duty. If one is born in a particular society or community, he should perform the prescribed duties for that particular division. If, however, one is fortunate enough to transcend the designation of birth in a particular society or community by being elevated to the standard of spiritual identity, then his sva-dharma, or duty, is solely that of serving the Supreme Personality of Godhead. The actual duty of one who is advanced in divine consciousness is to serve the Lord. As long as one remains in the bodily concept of life, he may act according to the duties of social convention, but if one is elevated to the spiritual platform, he must simply serve the Supreme Lord; that is the real execution of sva-dharma.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Комментарии


bottom of page