🌹. కపిల గీత - 183 / Kapila Gita - 183 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 37 🌴
37. దేహం చ తం న చరమః స్థితముత్థితం వా సిద్ధో విపశ్యతి యతోఽధృగమత్ స్వరూపమ్|
దైవాదుపేతమథ దైవవశాదపేతమ్ వాసో యథా పరికృతం మదిరామదాంధః॥
తాత్పర్యము : మాతా! మదిరాపానముచే మత్తులోనున్నవాడు, తన దేహముపైగల వస్త్రము సరిగా ఉన్నదనియు, జారిపోయినదియు గుర్తింపజాలఢు. అట్లే, బ్రాహ్ళీస్థితికి చేరినవానికి తన దేహముపై స్పృహయే ఉండదు. తాను కూర్చున్నదియు, లేనిదియు, ప్రారబ్ధవశమున ఎక్కడికైనను వెళ్ళినదియు, ఎక్కడనుండి వచ్చినదియు గమనింపడు. ఏలయన అతడు సర్వదా పరమానంద స్వరూపమునందే నిమగ్నుడై యుండును.
వ్యాఖ్య : ఈ జీవిత దశను రూప గోస్వామి తన భక్తి-రసామృత-సింధులో వివరించారు. భగవంతుని యొక్క కోరికతో మనస్సు పూర్తిగా నిండిపోయి, భగవంతుని సేవలో నూటికి నూరు శాతం నిమగ్నమై ఉన్న వ్యక్తి తన భౌతిక శరీర అవసరాలను మరచిపోతాడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 183 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 37 🌴
37. dehaṁ ca taṁ na caramaḥ sthitam utthitaṁ vā siddho vipaśyati yato 'dhyagamat svarūpam
daivād upetam atha daiva-vaśād apetaṁ vāso yathā parikṛtaṁ madirā-madāndhaḥ
MEANING : Because he has achieved his real identity, the perfectly realized soul has no conception of how the material body is moving or acting, just as an intoxicated person cannot understand whether or not he has clothing on his body.
PURPORT : This stage of life is explained by Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu. A person whose mind is completely dovetailed with the desire of the Supreme Personality of Godhead, and who engages one hundred percent in the service of the Lord, forgets his material bodily demands.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
コメント