top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 186 / Kapila Gita - 186


🌹. కపిల గీత - 186 / Kapila Gita - 186 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 40 🌴


40. యథోల్ముకాద్విస్ఫులింగాద్ధూమాద్వాపి స్వసంభవాత్|

అప్యాత్మత్వేనాభిమతాద్యథాగ్నిః పృథగుల్ముకాత్॥


తాత్పర్యము : కాలుచున్న కట్టెలనుండి వెలువడిన మంట, మంట ఆరిన పిదప ఉండే నిప్పు, నిప్పురవ్వలు, పొగ ఇవన్నీ అగ్నినుండి పుట్టినవే. ఇవన్నీ అగ్నిగనే పరిగణింప బడుచున్నవి. కాని, నిజమునకు అగ్ని వీటన్నిటికంటెను వేరైనది గదా!


వ్యాఖ్య : శరీరమూ ఆత్మా ఎలా వేరో, ప్రకృతి వేరు పరమాత్మ వేరు. అగ్ని వల్లనే నిప్పు రవ్వ (విస్ఫులింగం) ఏర్పడుతుంది. అగ్ని, పచ్చి కట్టే సమ్యోగము వలనే పొగ వస్తుంది. ఆ కట్టెకు అంటుకున్న నిప్పు కట్టె బాగా కాలి కిందపడితే అది నిప్పు కణం అంటాం. మరి నిప్పూ, నిప్పుకణం, పొగ ఈ మూడూ ఒకటేనా? వేరా? నిప్పు వలన వచ్చిన పొగా ఎలా నిప్పు కాదో, అగ్ని సమ్యోగం వలన వచ్చిన కట్టే, కట్టెలోంచి వచ్చిన నిప్పు కణం, ఎలా నిప్పుకన్నా వేరో, దాని కన్నా అగ్ని ఎలా వేరుగా ఉందని చెప్పుకుంటామో పొగ వేరు, నిప్పు కణం వేరు, నిప్పు వేరు - అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 186 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 4. Features of Bhakti Yoga and Practices - 40 🌴


40. yatholmukād visphuliṅgād dhūmād vāpi sva-sambhavāt

apy ātmatvenābhimatād yathāgniḥ pṛthag ulmukāt


MEANING : The blazing fire is different from the flames, from the sparks and from the smoke, although all are intimately connected because they are born from the same blazing wood.


PURPORT : Although the blazing firewood, the sparks, the smoke and the flame cannot stay apart because each of them is part and parcel of the fire, still they are different from one another. A less intelligent person accepts the smoke as fire, although fire and smoke are completely different. The heat and light of the fire are separate, although one cannot differentiate fire from heat and light.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page