top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 187 / Kapila Gita - 187


🌹. కపిల గీత - 187 / Kapila Gita - 187 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 41 🌴


41. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాజ్జీవసంఙ్ఞితాత్|

ఆత్మా తథా పృథగ్ద్రష్టా భగవాన్ బ్రహ్మసంఙ్ఞితః॥


తాత్పర్యము : ఇదే విధముగా పాంచభౌతికదేహము, ఇంద్రియములు, అంతఃకరణము అను వాటిని దర్శించే ఆత్మ వాటికంటే వేరైనది. ఇట్లే జీవుడు అని పిలువబడే ఆత్మకంటే బ్రహ్మ భిన్నముగా ఉన్నాడు. మరియు ప్రకృతికంటే ప్రకృతి నియామకుడైన పురుషోత్తముడు వేరైనవాడు, విలక్షణుడు.


వ్యాఖ్య : పొగ వేరు, నిప్పు కణం వేరు, నిప్పు వేరు - అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు. పొగ నిప్పు రవ్వా, అగ్ని వలనే వస్తుంది. కానీ అగ్ని వీటన్నిటికన్నా వేరుగా ఉంటుంది. పరమాత్మ నుంచి వచ్చినవన్నీ చూచి వాటిని తాత్కాలికముగా వాటిని పరమాత్మ అని భ్రమించుట, పొగను నిప్పు అనుకోవడం అని భ్రమించుట వంటిది. ప్రధానం (కర్మేందిర్య జ్ఞ్యానేంద్రియ మనసు బుద్ధి చిత్తం అంతఃకరణం), జీవుడు, వీటి కంటే పరమాత్మ వేరు. వేరుగా ఉండి, అన్నింటిలోనూ ఉండి చూచేవాడు, ఆరు గుణములు కలవాడు, బ్రహ్మ సజ్ఞ్యిత అయిన వాడు పరమాత్మ.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 187 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 4. Features of Bhakti Yoga and Practices - 41 🌴


41. bhūtendriyāntaḥ-karaṇāt pradhānāj jīva-saṁjñitāt

ātmā tathā pṛthag draṣṭā bhagavān brahma-saṁjñitaḥ


MEANING : The Supreme Personality of Godhead, who is known as Parambrahma, is the seer. He is different from the jīva soul, or individual living entity, who is combined with the senses, the five elements and consciousness.


PURPORT : A clear conception of the complete whole is given herewith. The living entity is different from the material elements, and the supreme living entity, the Personality of Godhead, who is the creator of the material elements, is also different from the individual living entity. Everything is simultaneously one with and different from everything else. The cosmic manifestation created by the Supreme Lord by His material energy is also simultaneously different and nondifferent from Him. The material energy is nondifferent from the Supreme Lord, but at the same time, because that energy is acting in a different way, it is different from Him. Similarly, the individual living entity is one with and different from the Supreme Lord. Living entities are compared to the sparks of a fire. As stated in the previous verse, fire, flame, smoke and firewood are combined together. Here the living entity, the material elements and the Supreme Personality of Godhead are combined together. The exact position of the living entities is just like that of the sparks of a fire; they are part and parcel. The material energy is compared to the smoke. The fire is also part and parcel of the Supreme Lord.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Recent Posts

See All

Commentaires


bottom of page