top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 190 / Kapila Gita - 190


🌹. కపిల గీత - 190 / Kapila Gita - 190 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 44 🌴


44. తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికామ్|

దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే॥


తాత్పర్యము : కావున, భగద్భక్తుడు జీవుల స్వరూపములలో దాగియున్న కార్యకారణరూపముగా పరిణమించెడు భగవంతుని అచింత్యమగు మాయాశక్తిని భగవదనుగ్రహముచే జయించి, తన వాస్తవస్వరూపము అగు పరబ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై యుండును.


వ్యాఖ్య : వంకర కట్టెలో గానీ, పొడుగు కట్టెలో గానీ ఒకే నిప్పు చాలారకాలుగా కంపిస్తుంది. అలాగే ఆత్మ కూడా చాలా రకాలుగా కనపడుతుంది. ఈ ప్రకృతి దైవీం (దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా- గీత). ఇది కార్య కారణ రూపములో ఉంటుంది. ఇది మన ఊహకు అందదు. అలాంటి ప్రకృతిని విడిచిపెట్టిన వాడే స్వస్వరూపముతో ఉండగలడు. ప్రకృతిని వదిలిపెట్టాకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు. ప్రకృతి వదిలి పెట్టాలంటే కార్య కారణం గురించి అర్థం కావాలి. ప్రకృతి పురుషున్ని విడిచిపెట్టదు కదా అని దేవహూతి అడిగిన ప్రశ్నకు సమాధానముగా కపిలుడు చెప్పిన సమాధానం ఇది.


శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కంధము నందు "భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు" అను ఇరువది ఎనిమిది అధ్యాయము సమాప్తము.


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 190 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 4. Features of Bhakti Yoga and Practices - 44 🌴


44. tasmād imāṁ svāṁ prakṛtiṁ daivīṁ sad-asad-ātmikām

durvibhāvyāṁ parābhāvya svarūpeṇāvatiṣṭhate


MEANING : Thus the yogī can be in the self-realized position after conquering the insurmountable spell of māyā, who presents herself as both the cause and effect of this material manifestation and is therefore very difficult to understand.


PURPORT : It is stated in Bhagavad-gītā that the spell of māyā, which covers the knowledge of the living entity, is insurmountable. However, one who surrenders unto Kṛṣṇa, the Supreme Personality of Godhead, can conquer this seemingly insurmountable spell of māyā. Here also it is stated that the daivī prakṛti, or the external energy of the Supreme Lord, is durvibhāvyā, very difficult to understand and very difficult to conquer. One must, however, conquer this insurmountable spell of māyā, and this is possible, by the grace of the Lord, when God reveals Himself to the surrendered soul. It is also stated here, svarūpeṇāvatiṣṭhate. Svarūpa means that one has to know that he is not the Supreme Soul, but rather, part and parcel of the Supreme Soul; that is self-realization. To think falsely that one is the Supreme Soul and that one is all-pervading is not svarūpa. This is not realization of his actual position. The real position is that one is part and parcel. It is recommended here that one remain in that position of actual self-realization. In Bhagavad-gītā this understanding is defined as Brahman realization. After Brahman realization, one can engage in the activities of Brahman. As long as one is not self-realized, he engages in activities based on false identification with the body. When one is situated in his real self, then the activities of Brahman realization begin.


With this, Chapter "Features of Bhakti Yoga and Practices" End.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page