top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 201 / Kapila Gita - 201


🌹. కపిల గీత - 201 / Kapila Gita - 201 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 11 🌴


11. మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే|

మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోఽమ్బుధౌ॥


తాత్పర్యము : గంగానది అఖండముగా సముద్రము వైపు ప్రవహించునట్లు, నా గుణములను గూర్చి వినినంత మాత్రముననే భక్తుని మనస్సు తైలధారవలె అవిచ్ఛిన్నముగా సర్వాంతర్యామినైన నా యందే లగ్నమగును.


వ్యాఖ్య : ఈ చివరిదైన తొమ్మిదవ రకమైన భక్తి ఉన్నవారు, పరమాత్మ యందే ఎలాంటి విచ్చేధమైన లేని మానసిక స్థితో మనసు ఉంచాలి. నిరంతరం నా (పరమాత్మ) గుణాలు వింటే అదే కలుగుతుంది. స్తోత్రము చేయడానికి కావలసిన అనంత కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. అటువంటి నా గుణాలకు సంబంధించిన కథలను వింటే నా యందు అవిచ్చిన్నమైన భావం కలుగుతుంది. సముద్రములో కలవడానికి బయలుదేరిన గంగా ప్రవాహం ఎలా విచ్చిన్నం కాదో నా యందు ఉంచిన భక్తి కూడా విచ్చిన్నం కాదు. దానికి ఆశ్రయించ వలసిన ప్రధాన సాధనం నా గుణాలని వినడం.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 201 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 5. Form of Bhakti - Glory of Time - 11 🌴


11. mad-guṇa-śruti-mātreṇa mayi sarva-guhāśaye

mano-gatir avicchinnā yathā gaṅgāmbhaso 'mbudhau


MEANING : Just as the water of the Ganges flows naturally down towards the ocean, such devotional ecstasy, uninterrupted by any material condition, flows towards the Supreme Lord.


PURPORT : The basic principle of this unadulterated, pure devotional service is love of Godhead. Mad-guṇa-śruti-mātreṇa means "just after hearing about the transcendental qualities of the Supreme Personality of Godhead." These qualities are called nirguṇa. The Supreme Lord is uncontaminated by the modes of material nature; therefore He is attractive to the pure devotee. There is no need to practice meditation to attain such attraction; the pure devotee is already in the transcendental stage, and the affinity between him and the Supreme Personality of Godhead is natural and is compared to the Ganges water flowing towards the sea. The flow of the Ganges water cannot be stopped by any condition; similarly, a pure devotee's attraction for the transcendental name, form and pastimes of the Supreme Godhead cannot be stopped by any material condition. The word avicchinnā, "without interruptions," is very important in this connection. No material condition can stop the flow of the devotional service of a pure devotee. The word ahaitukī means "without reason." A pure devotee does not render loving service to the Personality of Godhead for any cause or for any benefit, material or spiritual. This is the first symptom of unalloyed devotion.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



1 view0 comments

Recent Posts

See All

コメント


bottom of page