🌹. కపిల గీత - 206 / Kapila Gita - 206 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 16 🌴
16. మద్దిష్ణ్యదర్శనస్పర్శపూజాస్తుత్యభివందనైః|
భూతేషు మద్భావనయా సత్త్వేనాసంగమేన చ॥
తాత్పర్యము : నా ప్రతిమను దర్శించుచు, స్పృశించుచు, పూజించుచు, స్తుతించుచు వందనమాచరింప వలెను. సమస్త ప్రాణుల యందును భగవంతునే భావింపవలెను. ధైర్యమును, వైరాగ్యమును కలిగియుండవలెను.
వ్యాఖ్య : నా స్వరూపం, లేదా ఆలయములో నా విగ్రహాన్ని దర్శనముతో స్పర్శతో పూజతో వందనముతో గానీ, అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు అనే భావముతో పూజించాలి స్తుతించాలి అభినందించాలి వందనం చేయాలి. అన్ని ప్రాణులలో నా భావన కలిగి ఉండాలి. ఇవన్నీ ఉండి కూడా సత్వం (ధైర్యం) ఉండాలి. సిగ్గుపడడానికి హేతువైన ఎన్నో పనులు ధైర్యముగా చేస్తూ, పరమాత్మని అర్చించడానికి సిగ్గుపడటం ధైర్యం లేకపోవడం. భక్తి ఉన్నా, ఉన్న భక్తితో పరమాత్మను అర్చించడానికి ధైర్యం కావాలి,. ఆ ధైర్యం కలగాలంటే సంసారం యందు ఆసక్తి ఉండకూడదు. పక్కవారేమనుకున్నా నేను భగవదార్చన చేస్తాను అనుకునేదెప్పుడు? వాడి వలన మనకు కలిగే ప్రయోజనం పోతుందేమో అన్న భయం పోయిన నాడు అనుకుంటాము. ఎదుటి వారు అవహేళన చేస్తారేమో అనుకున్నవాడు భక్తుడు కాలేడు. అందుకు ధైర్యముండాలి, అది కలగడానికి అసంగముండాలి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 206 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 5. Form of Bhakti - Glory of Time - 16 🌴
16. mad-dhiṣṇya-darśana-sparśa-pūjā-stuty-abhivandanaiḥ
bhūteṣu mad-bhāvanayā sattvenāsaṅgamena ca
MEANING : The devotee should regularly see My statues in the temple, touch My lotus feet and offer worshipable paraphernalia and prayer. He should see in the spirit of renunciation, from the mode of goodness, and see every living entity as spiritual.
PURPORT : Temple worship is one of the duties of a devotee. It is especially recommended for neophytes, but those who are advanced should not refrain from temple worship. There is a distinction in the manner a neophyte and an advanced devotee appreciate the Lord's presence in the temple. A neophyte considers the arcā-vigraha (the statue of the Lord) to be different from the original Personality of Godhead; he considers it a representation of the Supreme Lord in the form of a Deity. But an advanced devotee accepts the Deity in the temple as the Supreme Personality of Godhead. He does not see any difference between the original form of the Lord and the statue, or arcā form of the Lord, in the temple. This is the vision of a devotee whose devotional service is in the highest stage of bhāva, or love of Godhead, whereas a neophyte's worship in the temple is a matter of routine duty.
Temple Deity worship is one of the functions of a devotee. He goes regularly to see the Deity nicely decorated, and with veneration and respect he touches the lotus feet of the Lord and presents offerings of worship, such as fruits, flowers and prayers. At the same time, to advance in devotional service, a devotee should see other living entities as spiritual sparks, parts and parcels of the Supreme Lord. A devotee is to offer respect to every entity that has a relationship with the Lord. Because every living entity originally has a relationship with the Lord as part and parcel, a devotee should try to see all living entities on the same equal level of spiritual existence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Yorumlar