top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 210 / Kapila Gita - 210


🌹. కపిల గీత - 210 / Kapila Gita - 210 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 20 🌴


20. యథా వాతరథో ఘ్రాణమావృంక్తే గంధ ఆశయాత్|

ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారి యత్॥


తాత్పర్యము : పుష్పముల పరిమళము వాయువు ద్వారా ఘ్రాణేంద్రియమునకు చేరినట్లు, భక్తియోగ తత్పరుడైన పురుషుని చిత్తము రాగద్వేషాది వికార శూన్యమై పరమాత్మను చేరును.


వ్యాఖ్య : భక్తి యోగమంటే ఏమిటి, ఏది ఉత్తమ భక్తి యోగం, అది ఎలా కలుగుతుంది, అది కలిగిన వాడు ఏమి పొనుతాడు అనేది ఈ పై ఇరవై శ్లోకాలలో చెప్పాడు.సంసారములో ఉండి ఆశా పాశాలకు కట్టుబడిన వాడు ఇంత మురికిలో ఉండి కూడా ఇవన్నీ పొందగలరా? ఇన్ని బంధాలు ఉన్నప్పుడు, అడ్డంకులు ఉన్నప్పుడు, ఇంత మురికి మన చుట్టూ ఉన్నప్పుడు, ఇవి కాదని మనం భగవంతుని చేరగలమా? మన ప్రయత్నముతో చేయగలమా? కొన్ని మన ప్రయత్నం లేకుండా అవుతాయి. ఉదా: వాయును ఆవేశించి పుష్పము యొక్క సుగంధము మన నాసికను చేరి శుభ్రపరుస్తుంది.దానికి మనం చేయాల్సింది మన ఘ్రాణం ఆ పూల తోట దగ్గరలో ఉండాలి. అలాగే మన చిత్తం యోగాన్ని ఆశ్రయించి ఆ మార్గములో ఉంటే ప్రయత్నం లేకుండానే చేరుతుంది. మన మనసు పరమాత్మను చేరినట్లు ధ్యానం చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది. అలాంటి వాడు ఎలా ఉంటాడు? పరమ కోపిష్టీ ఆరాధన చేస్తున్నాడు, పరమ సాత్వికుడూ ఆరాధన చేస్తున్నాడు. వీరిలో ఎవరు ఎవరని ఎలా గుర్తించాలి?



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 210 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 5. Form of Bhakti - Glory of Time - 20 🌴


20. yathā vāta-ratho ghrāṇam āvṛṅkte gandha āśayāt

evaṁ yoga-rataṁ ceta ātmānam avikāri yat


MEANING : As the chariot of air carries an aroma from its source and immediately catches the sense of smell, similarly, one who constantly engages in devotional service, in Kṛṣṇa consciousness, can catch the Supreme Soul, who is equally present everywhere.


PURPORT : As a breeze carrying a pleasant fragrance from a garden of flowers at once captures the organ of smell, so one's consciousness, saturated with devotion, can at once capture the transcendental existence of the Supreme Personality of Godhead, who, in His Paramātmā feature, is present everywhere, even in the heart of every living being. It is stated in Bhagavad-gītā that the Supreme Personality of Godhead is kṣetra jña, present within this body, but He is also simultaneously present in every other body. Since the individual soul is present only in a particular body, he is altered when another individual soul does not cooperate with him. The Supersoul, however, is equally present everywhere. Individual souls may disagree, but the Supersoul, being equally present in every body, is called unchanging, or avikāri. The individual soul, when fully saturated with Kṛṣṇa consciousness, can understand the presence of the Supersoul. It is confirmed in Bhagavad-gītā that (bhaktyā mām abhijānāti (BG 18.55)) a person saturated with devotional service in full Kṛṣṇa consciousness can understand the Supreme Personality of Godhead, either as Supersoul or as the Supreme Person.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page