🌹. కపిల గీత - 211 / Kapila Gita - 211 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 21 🌴
21. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితస్సదా|
తమవజ్ఞాయ మాం మర్త్య కురుతేఽర్చావిడంబనమ్॥
తాత్పర్యము : భగవంతుడు ఆత్మస్వరూపమున సకలజీవుల యందును సర్వదా యుండును. సర్వప్రాణులలో ఆత్మస్వరూపముగా, భగవంతుడు అంతర్యామిగా ఉన్నవిషయమును విస్మరించి వారియెడ అనాదరభావము వహించుచు, కేవలము భగవత్ప్రతిమనే అర్చించు వాని పూజ ఆడంబరముతో గూడినదేయగును.
వ్యాఖ్య : పరమాత్మ అన్ని వేళలా అన్ని చోట్లా అందరిలో అంతర్యామిగా ఉంటాడు. ఈ విషయాన్ని కాస్తా మరచిపోయి, నిర్లక్షం చేసి, ఆ భావాన్ని వదిలిపెట్టి, ఆరాధనకు అర్భాటం చేస్తాడు. సర్వభూతాంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించకుండా ఆరాధనలో ఆడంబరం చూపిస్తే అది ఆడంబరం మాత్రమే. అంతటా పరమాత్మను చూడగలిగినవాడు, పరమాత్మ రూపముగా ఉన్న వారందరినీ సమానముగా ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. వారందరి సహకారముతో భగవానున్ని ఆరాధిస్తాడు. దాన్ని మర్చిపోయి అర్చావిడంబనం చేస్తున్న వారికి నా మీద భక్తి ఉండదు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 211 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 5. Form of Bhakti - Glory of Time - 21 🌴
21. ahaṁ sarveṣu bhūteṣu bhūtātmāvasthitaḥ sadā
tam avajñāya māṁ martyaḥ kurute 'rcā-viḍambanam
MEANING : I am present in every living entity as the Supersoul. If someone neglects or disregards that Supersoul everywhere and engages himself in the worship of the Deity in the temple, that is simply imitation.
PURPORT : In purified consciousness, or Kṛṣṇa consciousness, one sees the presence of Kṛṣṇa everywhere. If, therefore, one only engages in Deity worship in the temple and does not consider other living entities, then he is in the lowest grade of devotional service. One who worships the Deity in the temple and does not show respect to others is a devotee on the material platform, in the lowest stage of devotional service. A devotee should try to understand everything in relationship with Kṛṣṇa and try to serve everything in that spirit. To serve everything means to engage everything in the service of Kṛṣṇa. If a person is innocent and does not know his relationship with Kṛṣṇa, an advanced devotee should try to engage him in the service of Kṛṣṇa. One who is advanced in Kṛṣṇa consciousness can engage not only the living being but everything in the service of Kṛṣṇa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments