గురు పౌర్ణమి శుభాకాంక్షలు - Good Wishes On Guru pournami
- Prasad Bharadwaj
- Jul 3, 2023
- 1 min read

🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు మరియు అందరికి Good Wishes On Guru pournami to you and All 🌹
🍀. విశ్వగురువు మరియు అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదార విందములకు.......🍀
🙏. ప్రసాద్ భరద్వాజ
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:
🌻. గురుపౌర్ణమి విశిష్టత 🌻
ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.
మానవ జీవితానికి మార్గనిర్దేశం చేస్తూ భగవంతుని సాక్షాత్కారమే మానవ జీవిత లక్ష్యం గా దారి చూపి, నడిపించే దేవుడు గురువు. గురుపౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. అలాగే గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠుల వారిని, శక్తి మునిని, పరాశరుడిని, వ్యాసుల వారిని, శుకమహామునిని, ఇత్యాది వారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. "గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరించాలి అంటారు. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువే కదా" అన్నారు భక్త కబీర్. ఈ మాట సదా స్మరణీయం. ఈ మాట అందించిన వారు మనకు గురువే. మంచిని చెప్పినవాడు, నేర్పినవాడు, చూపినవాడు మనకి గురువే అని చెప్తున్న మన సనాతన ధర్మానికి వందనాలు.
🌹 🌹 🌹 🌹 🌹
Comments