top of page
Writer's picturePrasad Bharadwaj

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి / Worship Maa Kaalratri - Durga D


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి / Worship Maa Kaalratri - Durga Devi on the 7th day of Navaratri 🌹


📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. కాళరాత్రి మాత ప్రార్ధనా శ్లోకము 🌷 'ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లో హలతా కంటక భూషణా ।

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥ 🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷 రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ 🌷. అలంకారము - నైవేద్యం : దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు - కదంబం (కిచిడి), శాకాన్నం. 🌷. మహిమ - చరిత్ర 🌷 దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతి వహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కు తుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయ ముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందు వలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళనను గానీ పొందనవసరం లేదు. 🌻. సాధన : దుర్గా నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది. కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేత పిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయ విముక్తులవుతారు. కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం. 🌹 🌹 🌹 🌹 🌹


コメント


bottom of page