దేవతలు -1
దేవతలు, రాక్షసులు మానవులయందే మనోభావములుగా వర్తించు చున్నారు. క్రూరత్వము, కఠినత, మోసము, ఈర్ష్యాసూయాదులు, తత్ఫలితమగు దుఃఖము రాక్షస లక్షణములు. ఇవి నిత్యము వర్తించు ఇంద్రియ వ్యాపారము వలన మలినములై మనస్సున భాసించు కామక్రోధాదుల నుండి ఉద్భవించు చుండును. బుద్ధి శక్తియైన వివేకముతో వీనిని జయించి మానవుడు దివ్యలక్షణములను ఆశ్రయించుటకు నిత్యము సమర్థుడై యున్నాడు.
సంకల్పము వలన ఔదార్యము, సహనము, ఆహ్లాదము, సత్య శౌచ శాంత్యహింసలు, కారుణ్యము అను దివ్య లక్షణములను మానవుడు వరింపగలడు. దీనివలన మనోభావ స్వరూపులై దేవతలు మానవుని వరించి వానియందు విహరింతురు. "దేవతలను ఆదరించుట వలన వారు మనల నాదరింతురు.” అని భగవద్గీతలో చెప్పబడినది. ...
Comments