దేవతలందరికీ ఒక పద్ధతి ఉంది. అది ఏమిటంటే. All the gods have a system. That's what it is.
- Prasad Bharadwaj
- Feb 17, 2023
- 1 min read

🌹. దేవతలందరికీ ఒక పద్ధతి ఉంది. అది ఏమిటంటే 🌹
"ఏ మనిషైనా ఒక మంత్రాన్ని రోజుకు కనీసం మూడు గంటలకు తగ్గకుండా వరుసగా 6 నెలల పాటు (అంటే ఒక్కరోజు కూడా విరామం లేకుండా) జపం చేస్తే ఆ వ్యక్తి యొక్క మనోభూమిక లోకి దేవత ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అతని తానే నడిపించడం మొదలు పెడుతుంది. తనకు ఏదైనా ఆపద రాబోతుంటే ముందే హెచ్చరిక చేస్తుంది. ఆ ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. అదే మనం కనుక తీవ్ర సాధన చేసినట్లు అయితే ప్రమాదమే లేకుండా చేస్తుంది. ఇలా ఎందుకంటే ఏ వ్యక్తి అయినా పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ జన్మలో బుద్ధి నడుస్తుంది. అంటే తాను పూర్వజన్మలో చేసిన ఏదైనా పాపకర్మ కారణంగా ఈ జన్మలో ప్రమాదం జరగాలని ఉంటే అతను ప్రమాదం వైపు వెళ్లే విధంగా అతని బుద్ధిని అతను చేసిన పూర్వజన్మలో చేసిన కర్మే ప్రేరేపిస్తుంది. అప్పుడు అతడు ప్రమాదానికి గురై పూర్వజన్మలో చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాడు. అలా కాకుండా ఇప్పుడు చెప్పినట్లు 6 నెలలు మంత్రజపం చేస్తే ఆ దేవత ఆ వ్యక్తి యొక్క బుద్దికి కారణమైన పూర్వజన్మ కర్మను పక్కన నెట్టివేసి తాను వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో వచ్చే కష్టాలను తప్పించుకో గలుగుతాడు. పైగా ఆ 6 నెలల జపం వల్ల అతడు అరిషడ్వర్గాలను కూడా జయించగలుగుతాడు. పైగా దేవతే అతడిని నడిపిస్తుంది. ఎప్పటికప్పుడు దేవతే అతడికి తగిన సూచనలిస్తుంది. తప్పు చేస్తుంటే చేయవద్దని మనసులో సూచిస్తుంది. ఒప్పు చేస్తుంటే చేయమని ప్రేరేపిస్తుంది. చివరికి అరిషడ్వర్గాలను జయించే స్థితికి తీసుకువెళుతుంది. ఇది నిజం. ప్రతిఒక్కరూ చేయండి.
🌹🌹🌹🌹🌹
Comments