🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 387 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. 🍀
జీవితం ఒక్కటే దేవుడు. వ్యక్తి దాంట్లో జీవించాలి. గాఢంగా జీవించాలి. అనురాగభరితంగా, ఆర్ద్రంగా, హృదయపూర్వకంగా జీవించాలి. వానపాము లాగా కాదు. రెండు వైపులా మంట వున్న కాగడాలా జీవించాలి. అప్పుడు అనంత శాశ్వతత్వం కన్నా ఒక్క క్షణం కూడా అద్భుతమైనది అవుతుంది. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. దేన్నీ వెనకనున్న దేన్నీ ఆధారంగా పట్టుకోకు. యిప్పుడు యిక్కడ నిలబడు. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. అన్యమనస్కంగా, అంటీ ముట్టనట్లు ఎందుకుండాలి? నువ్వు యింకో క్షణం వుండకపోవచ్చు.
కాబట్టి యీ క్షణాన్ని పట్టుకో. యింకో క్షణం సంగతి నీకెందుకు? జీవించే విధానమిది. నువ్వు ఫలితం గురించి పట్టించుకోకుంటే పద్మానివి. మాటిమాటికీ పద్మాన్ని మననం చేయాలి. వర్తమానం లోలోతుల్లోకి వెళ్ళు. యిప్పుడు యిక్కడ నిలబడాలి. కాని అనుబంధం లేకుండా వుండాలి. అతుక్కుపోకుండా వుండాలి. తాకకుండా వుండాలి. భవిష్యత్తు లేదు. అందువల్ల సంపూర్ణంగా జీవిస్తావు. గతం లేదు అందువల్ల అనుబంధముండదు. ఒకసారి అది జరిగితే జీవితం ఆనందం, అంతులేని ఆనందం శాశ్వతపరమానందం!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments