top of page
Writer's picturePrasad Bharadwaj

మహా శివరాత్రి శుభాకాంక్షలు, Good Wishes on Maha Shivaratri


🌹. మహా శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ, Good Wishes on Maha Shivaratri to All. 🌹


ప్రసాద్ భరద్వాజ


🌻.విశిష్టత - శివ మంగళాష్టకం 🌻


మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.


శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగ రూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.


శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.


ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.


నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.




🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀


1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |


కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్


2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |


పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్


3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |


రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్


4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |


సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్


5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |


త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్


6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |


ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్


7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |


ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్


8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |


అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్


9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |


సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page