top of page
Writer's picturePrasad Bharadwaj

వర్షపు నీటితో ఇలా చేస్తే అప్పుల బాధ, దిష్టి దెబ్బ ఉండదట..! - If you do this with rain water, you wi


⛈️.వర్షపు నీటితో ఇలా చేస్తే అప్పుల బాధ, దిష్టి దెబ్బ ఉండదట..! ⛈️


వర్షంలో తడిచేందుకు కూడా తెగ ఇష్టపడతారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఏంటీ ఈ మధ్య తెగ అప్పులు చేస్తున్నారా..? ఒక అప్పు చేసి అది తీరక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుందా..? వర్షం నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..


అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకుని ఈ నీళ్లలో ఒక నెలపాటు స్నానం చేయండి. క్రమంగా మీ అప్పు తగ్గడం ప్రారంభమవుతుంది.


వ్యాపారంలో నష్టం వాటిల్లితే ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి రోజున ఈ నీటితో అమ్మవారికి, విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని కూడా చాలా మంది నమ్ముతారు.


మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు దూరమవుతాయి.


ఒక గిన్నెలో వర్షపు నీటిని నింపి పైకప్పుపై ఉంచండి. ఆ తర్వాత మీకు ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మామిడి ఆకుతో ఇంట్లో నీటిని చల్లాలని కూడా నమ్ముతారు. తల్లి లక్ష్మి ఈ పరిహారంతో సంతోషిస్తుంది, డబ్బు కొరతను తొలగిస్తుంది.


వివాహంలో ఇబ్బంది ఉంటే, వర్షపు నీటిని సేకరించి గణేశుడికి అభిషేకం చేయడం వల్ల పెళ్లి త్వరగా అవుతుంది.


ఏ రకమైన వ్యాధి లేదా ఏదైనా సంక్షోభం ఉంటే, వర్షం నీటిని సేకరించి, మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయండి.


ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అనుకుంటే అప్పులపాలు కావడమే. కాబట్టి ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచండి. ఈ నెలలో ప్రతిరోజూ 51 హనుమాన్ చాలీసాను పటించండి. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.


ఇలా వర్షపు నీటితో ఈ పరిహారాలు చేసుకుని సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే ఈ సమాచారం అంతా పండితులు చెప్పిందే మీకు అందించాం కానీ.. మేం సొంతంగా ఇవ్వలేదని గమనించగలరు. ఇలా చేస్తే నిజంగా అవుతుందా గ్యారెంటీ ఏంటి అంటారేమో.. ఆధారాలు లేవు.. ఆచారం మీద నమ్మకం ఉంటే పాటించండి.!


🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️

Comments


bottom of page