🍀. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Varalakshmi Vrat to All. 🍀
- ప్రసాద్ భరద్వాజ
🌸. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలకష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.
వరలక్ష్మీ స్తోత్రం :
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః
🌹 🌹 🌹 🌹 🌹
Comments