🌹. శ్రీమద్భగవద్గీత - 320 / Bhagavad-Gita - 320 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 10 🌴
10. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురషముపైతి దివ్యమ్ ||
🌷. తాత్పర్యం :
మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించెడి వాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.
🌷. భాష్యము :
మరణసమయమునందు దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తి యందే మనస్సును లగ్నము చేయవలెనని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. యోగాభ్యాసము చేయువారు ప్రాణమును భ్రూమధ్యమునకు (ఆజ్ఞాచక్రమునకు) చేర్చవలెనని ఇచ్చట ఉపదేశింపబడినది. ఈ విధముగా ఆరుచక్రములపై ధ్యానమును కూడిన షట్చక్రాభ్యాసము ఇచ్చట సూచించబడుచున్నది. కాని శుద్ధభక్తుడు ఇట్టి షట్చక్రయోగము నభ్యసింపడు.
కాని అతడు కృష్ణభక్తిభావనలో సంతతమగ్నుడై మరణ సమయము నందును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతని కరుణ చేతనే స్మరింపగలుగును. ఈ విషయము పదునాలుగవ శ్లోకమున విశదముగా వివరింపబడినది. ఈ శ్లోకమున “యోగబలేన” యను పదమునకు ప్రాధాన్యము కలదు. ఏలయన యోగాభ్యాసము లేకుండా మరణసమయము నందు ఎవ్వరును ఇట్టి దివ్యస్థితికి రాలేరు. ఆ యోగము షట్చక్రయోగమైనను లేదా భక్తియోగమైనను సరియే.
అంతియేగాక ఈ యోగమును అభ్యసించకుండా హఠాత్తుగా మరణసమయమున శ్రీకృష్ణభగవానుని స్మరించుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. మనుజుడు ఏదియో ఒక యోగవిధానమును (ముఖ్యముగా భక్తియోగమును) అభ్యసించియే తిరవలెను. మరణ సమయమున మనస్సు కలత చెందియుండును గనుక మనుజుడు యోగము ద్వారా జీవితకాలమునందు దివ్యత్వము అభ్యసింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 320 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 10 🌴
10. prayāṇa-kāle manasācalena bhaktyā yukto yoga-balena caiva
bhruvor madhye prāṇam āveśya samyak sa taṁ paraṁ puruṣam upaiti divyam
🌷 Translation :
One who, at the time of death, fixes his life air between the eyebrows and, by the strength of yoga, with an undeviating mind, engages himself in remembering the Supreme Lord in full devotion, will certainly attain to the Supreme Personality of Godhead.
🌹 Purport :
In this verse it is clearly stated that at the time of death the mind must be fixed in devotion to the Supreme Personality of Godhead. For those practiced in yoga, it is recommended that they raise the life force between the eyebrows (to the ājñā-cakra). The practice of ṣaṭ-cakra-yoga, involving meditation on the six cakras, is suggested here. A pure devotee does not practice such yoga, but because he is always engaged in Kṛṣṇa consciousness, at death he can remember the Supreme Personality of Godhead by His grace. This is explained in verse 14.
The particular use of the word yoga-balena is significant in this verse because without practice of yoga – whether ṣaṭ-cakra-yoga or bhakti-yoga – one cannot come to this transcendental state of being at the time of death. One cannot suddenly remember the Supreme Lord at death; one must have practiced some yoga system, especially the system of bhakti-yoga. Since one’s mind at death is very disturbed, one should practice transcendence through yoga during one’s life.
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios