top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 340: 09వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 340: Chap. 09, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita - 340 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 02 🌴


02. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం :


ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.


🌷. భాష్యము :


పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్త్వముల సారమైయున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్ల రాజుగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తత్త్వవేత్తలలో గౌతముడు, కణాడుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంతసూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతిముఖ్యులు. కనుక ఇచ్చట ఆధ్యాత్మికజ్ఞానమునందు గాని లేదా తత్త్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు.


అట్టి సమస్తజ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణభగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్త్వాధ్యయనము వలన కలిగెడి జ్ఞానము యొక్క సారమై యున్నది. గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసికొనుట యందు కేంద్రీకరింపబడను గావున ఈ నవమాధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్యజ్ఞానము భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.


సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానమునందు గాక, భౌతికమైన జ్ఞానమునందు ప్రవీణులై యందురు. లౌకికవిద్యకు సంబంధించినంతవరకు జనులు రాజనీతి, సామాజికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, యంత్రశాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగియున్నారు.


ప్రపంచమనదంతటను పలు విజ్ఞానశాఖలు మరియు విశ్వవిద్యాలయములు ఉన్నను దురదృష్టవశాత్తు వారికి ఆత్మను గూర్చి విద్యగరువు విశ్వవిద్యాలయముగాని లేక విద్యాసంస్థగాని ఎచ్చోటను లేదు. కాని వాస్తవమునకు దేహమునందు ఆత్మ అత్యంత ముఖ్యాంశమై యున్నది. ఆత్మ లేని దేహము నిరుపయోగమును, విలువరహితమును కాగలదు. అయినను జనులు ముఖ్యమైన ఆత్మను గూర్చి పట్టించుకొనక దేహావసరములకే ఎక్కువ ప్రాముఖ్యము నొసగుచున్నారు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 340 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 🌴


02 . rāja-vidyā rāja-guhyaṁ pavitram idam uttamam

pratyakṣāvagamaṁ dharmyaṁ su-sukhaṁ kartum avyayam



🌷 Translation :


This knowledge is the king of education, the most secret of all secrets. It is the purest knowledge, and because it gives direct perception of the self by realization, it is the perfection of religion. It is everlasting, and it is joyfully performed.


🌹 Purport :


This chapter of Bhagavad-gītā is called the king of education because it is the essence of all doctrines and philosophies explained before. Among the principal philosophers in India are Gautama, Kaṇāda, Kapila, Yājñavalkya, Śāṇḍilya and Vaiśvānara. And finally there is Vyāsadeva, the author of the Vedānta-sūtra. So there is no dearth of knowledge in the field of philosophy or transcendental knowledge.


Now the Lord says that this Ninth Chapter is the king of all such knowledge, the essence of all knowledge that can be derived from the study of the Vedas and different kinds of philosophy. It is the most confidential because confidential or transcendental knowledge involves understanding the difference between the soul and the body. And the king of all confidential knowledge culminates in devotional service.


Generally, people are not educated in this confidential knowledge; they are educated in external knowledge. As far as ordinary education is concerned, people are involved with so many departments: politics, sociology, physics, chemistry, mathematics, astronomy, engineering, etc.


There are so many departments of knowledge all over the world and many huge universities, but there is, unfortunately, no university or educational institution where the science of the spirit soul is instructed. Yet the soul is the most important part of the body; without the presence of the soul, the body has no value. Still people are placing great stress on the bodily necessities of life, not caring for the vital soul.


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Comments


bottom of page