🌹. శ్రీమద్భగవద్గీత - 341 / Bhagavad-Gita - 341 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 03 🌴
03. అశ్రద్ధధానా: పురుషా ధర్మస్యాస్య పరన్తప |
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని
🌷. తాత్పర్యం :
ఓ శత్రుంజయుడా! ఈ భక్తియుతసేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతికజగమునందలి జనన, మరణమార్గమునకే తిరిగివత్తురు.
🌷. భాష్యము :
శ్రద్ధలేనివారు ఈ భక్తియోగవిధానమును పొందలేరన్నది ఈ శ్లోకపు సారాంశము. శ్రద్ధ యనునది భక్తుల సాంగత్యము ద్వారా కలుగగలదు. అదృష్టహీనులైన వారు మహాత్ముల ద్వారా వేదవాజ్మయమునందలి నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మటయును శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను గాని, విశ్వాసమును గాని పొందారు. సంశయాత్ములైనందున వారు ఆ భగవానుని భక్తియోగములో స్థితిని పొందలేరు. కనుకనే కృష్ణభక్తిభావన యందు పురోగతి విశ్వాసము లేదా శ్రద్ధ యనునది అత్యంత ముఖ్యమైన అంశముగా పేర్కొనబడినది.
దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవామాత్రము చేతనే మనుజుడు పూర్ణత్వమును సాధింపగలడనెడి సంపూర్ణ నమ్మకమే విశ్వాసమని “చైతన్యచరితామృతము” తెలుపుచున్నది. అదియే నిజమైన శ్రద్ధ. ఈ విషయమును గూర్చి శ్రీమద్భాగవతము (4.31.14) నందు ఇట్లు తెలుపబడినది.
యథాతరోర్మూలనిషేచనేన తృప్యన్తి తత్స్కన్ధభుజోపశాఖా: |
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా
“వృక్షమూలమునకు నీరుపోయుట ద్వారా కొమ్మలు, రెమ్మలు, పత్రములను సంతృప్తిపరచినట్లు మరియు ఉదరమునకు ఆహారము నొసగుట ద్వారా ఇంద్రియములన్నింటిని తృప్తిపరచినట్లు, శ్రీకృష్ణభగవానుని దివ్యమగుసేవ యందు నిలుచుట ద్వారా మనుజుడు సర్వదేవతలను మరియు సర్వ ఇతరజీవులను అప్రయత్నముగా సంతృప్తిపరచినవాడగును.”
కనుక ప్రతియొక్కరు సర్వవిధములైన కర్మలను, ధర్మములను విడిచి శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవను స్వీకరింపవలసియున్నది. గీతను పఠించిన పిమ్మట ప్రతియోక్కరును ఈ గీతాసారాంశమునకే అరుదెంచవలెను. ఇట్టి తత్త్వము యెడ నిశ్చయమును పొందుటయే శ్రద్ధ యనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 341 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴
03 . aśraddadhānāḥ puruṣā dharmasyāsya paran-tapa
aprāpya māṁ nivartante mṛtyu-saṁsāra-vartmani
🌷 Translation :
Those who are not faithful in this devotional service cannot attain Me, O conqueror of enemies. Therefore they return to the path of birth and death in this material world.
🌹 Purport :
The faithless cannot accomplish this process of devotional service; that is the purport of this verse. Faith is created by association with devotees. Unfortunate people, even after hearing all the evidence of Vedic literature from great personalities, still have no faith in God. They are hesitant and cannot stay fixed in the devotional service of the Lord. Thus faith is a most important factor for progress in Kṛṣṇa consciousness. In the Caitanya-caritāmṛta it is said that faith is the complete conviction that simply by serving the Supreme Lord, Śrī Kṛṣṇa, one can achieve all perfection. That is called real faith. As stated in the Śrīmad-Bhāgavatam (4.31.14),
yathā taror mūla-niṣecanena
tṛpyanti tat-skandha-bhujopaśākhāḥ
prāṇopahārāc ca yathendriyāṇāṁ
tathaiva sarvārhaṇam acyutejyā
“By giving water to the root of a tree one satisfies its branches, twigs and leaves, and by supplying food to the stomach one satisfies all the senses of the body. Similarly, by engaging in the transcendental service of the Supreme Lord one automatically satisfies all the demigods and all other living entities.” Therefore, after reading Bhagavad-gītā one should promptly come to the conclusion of Bhagavad-gītā: one should give up all other engagements and adopt the service of the Supreme Lord, Kṛṣṇa, the Personality of Godhead. If one is convinced of this philosophy of life, that is faith.
🌹 🌹 🌹 🌹 🌹
Comments