🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 08 🌴
08. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పున:పున: |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||
🌷. తాత్ర్యం :
సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు, నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును.
🌷. భాష్యము :
ఇంతకు పూర్వమే పలుమార్లు వివరింపబడినట్లు భౌతికజగత్తు శ్రీకృష్ణభగవానుని న్యునశక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. సృష్టి సమయమున భౌతికశక్తి మహాతత్త్వముగా రుపొందగా భగవానుడు తన తొలి పురుషావతారమైన మాహావిష్ణువుగా దాని యందు ప్రవేశించును. అతడు కారణసముద్రములలో శయనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకముగా బ్రహ్మాండములను సృష్టించగా, దేవదేవుడు వాని యందు ద్వితీయ పురుషావతారమైన గర్భోదకశాయివిష్ణువు రూపమున ప్రవేశించును. ప్రతివిశ్వము ఈ విధముగనే సృజింపబడినది. పిమ్మట భగవానుడు క్షీరోదకశాయివిష్ణువు రూపమున ఆ బ్రహ్మాండము యందలి కణకణములతో సహా సర్వమునందును ప్రవేశించును. ఈ విధముగా శ్రీకృష్ణభగవానుడు సమస్తము నందును ప్రవేశించుననెడి విషయమే ఇచ్చట వివరింపబడినది.
ఇక జీవులకు సంబంధించినంతవరకు వారనదరును భౌతికప్రకృతి గర్భము నందుంచబడగా, వారివారి కర్మఫలముల ననుసరించి వివిధస్థానములను పొందుదురు. ఆ విధముగా భౌతికజగత్తు యొక్క కలాపములు ప్రారంభమగును. అనగా సృష్ట్యారంభమైన క్షణము నుండియే వివధజీవుల కార్యకలాపములు ఆరంభమై యున్నవి. కాలక్రమమున వృద్ధినొందుట లేదా పరిణామము చెందుటన్నది జరుగక జగము యొక్క సృష్టితో పాటుగానే వివిధజీవులు సృష్టింపబడిరి. అనగా మనుష్యులు, జంతువులు, మృగములు, పక్షులు మొదలుగునవన్నియును ఏకకాలమున సృష్టింప బడినవే. గడిచిన కల్పాంతమున జీవులు ఈ కోరికలను కలిగి యుందురో తద్రీతిగా వారు తిరిగి సృష్టింప బడుటయే అందులకు కారణము. ఈ విధానమున జీవుల చేయవలసినది ఏదియును లేదని “అవశమ్” అణు పదము ద్వారా సూచింపబడినది. అనగా గడచిన కల్పమునందలి గడచిన జన్మము యొక్క స్వభావము ననుసరించి జీవుడు తిరిగి సృష్టించ బడును. ఇదియంతయు భగవానుని సంకల్పము చేతనే జరుగుచుండును. ఇదియే శ్రీకృష్ణభగవానుని అచింత్యశక్తి. ఈ విధముగా వివిధజీవులను సృష్టించిన పిమ్మట అతడు వారితో సంబంధమును కలిగియుండడు. వివిధ జీవుల కోరికలను పూర్ణము చేయుటకే జగత్తు సృష్టింపబడుచున్నందున భగవానుడు దానితో సంబంధమును పెట్టుకొనడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 346 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 08 🌴
08 . prakṛtiṁ svām avaṣṭabhya visṛjāmi punaḥ punaḥ
bhūta-grāmam imaṁ kṛtsnam avaśaṁ prakṛter vaśāt
🌷 Translation :
The whole cosmic order is under Me. Under My will it is automatically manifested again and again, and under My will it is annihilated at the end.
🌹 Purport :
This material world is the manifestation of the inferior energy of the Supreme Personality of Godhead. This has already been explained several times. At the creation, the material energy is let loose as the mahat-tattva, into which the Lord as His first puruṣa incarnation, Mahā-viṣṇu, enters. He lies within the Causal Ocean and breathes out innumerable universes, and into each universe the Lord again enters as Garbhodaka-śāyī Viṣṇu. Each universe is in that way created. He still further manifests Himself as Kṣīrodaka-śāyī Viṣṇu, and that Viṣṇu enters into everything – even into the minute atom. This fact is explained here. He enters into everything. Now, as far as the living entities are concerned, they are impregnated into this material nature, and as a result of their past deeds they take different positions. Thus the activities of this material world begin.
The activities of the different species of living beings are begun from the very moment of the creation. It is not that all is evolved. The different species of life are created immediately along with the universe. Men, animals, beasts, birds – everything is simultaneously created, because whatever desires the living entities had at the last annihilation are again manifested. It is clearly indicated here by the word avaśam that the living entities have nothing to do with this process. The state of being in their past life in the past creation is simply manifested again, and all this is done simply by His will. This is the inconceivable potency of the Supreme Personality of God.
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios